AP Corona Lockdown: రేపటినుంచి ఏపీలో వాహనాలపై ఆంక్షలు.. సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షల అమలు..

AP Lockdown: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో

AP Corona Lockdown: రేపటినుంచి ఏపీలో వాహనాలపై ఆంక్షలు.. సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షల అమలు..
Corona Lockdown Ap
Follow us

|

Updated on: May 04, 2021 | 9:32 PM

AP Lockdown: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో రేపట్నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది. దీనిపై తాజాగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతి ఇచ్చింది.

దీనిలో భాగంగా.. ఏపీ సరిహద్దు వద్ద రేపటి నుంచి పబ్లిక్ వాహనాలపై ఆంక్షలు విధించనున్నట్లు కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి.. ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. రెండు వారాలపాటు ఏపీ బార్డర్లో ఈ ఆంక్షలే అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని స్పష్టంచేశారు.

ఇదిలాఉంటే.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అటు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూరప్రాంత బస్సు సర్వీసులు సైతం నిలిచిపోనున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఏపీలో గత 24 గంటల్లో 20వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,15,784 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో కొత్తగా 20,034 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 82 మంది మరణించారు.

Also Read:

Corona: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

CORONA SECOND-WAVE: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం