AP Corona Lockdown: ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌ర్ఫ్యూ స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

AP Corona Lockdown: దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో...

AP Corona Lockdown: ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌ర్ఫ్యూ స‌మ‌యంలో శ్రీవారి ద‌ర్శ‌నం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..
Ttd
Follow us

|

Updated on: May 05, 2021 | 5:48 AM

AP Corona Lockdown: దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో పాక్షిక లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో నేటి నుంచి రెండు వారాలా పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానున్న‌విష‌యం తెలిసిందే. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. ఇదిలా ఉంటే ఈ నేప‌థ్యంలో ప‌లు దేవాల‌యాల్లో ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల్లో అయోమ‌యం నెల‌కొంది. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో శ్రీవారి ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఉందా లేదా అన్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. దీంతో ఈ విష‌యంపై భ‌క్తుల‌కు స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి పాలకమండలి భక్తులకు స్పష్టతనిచ్చింది. శ్రీవారి దర్శనాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12గంటల తర్వాత శ్రీవారి దర్శనం టోకెన్లతో వచ్చే భక్తులను అనుమతిస్తామని తెలిపింది. కర్ఫ్యూ సందర్భంగా స్వామివారి దర్శనం విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అయితే తిరుమల కొండపై కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. ఇదిలా ఉంటే నేటి నుంచి ఏపీలో అమ‌ల్లోకి రానున్న క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో.. ఏపీ సరిహద్దు వద్ద పబ్లిక్ వాహనాలపై ఆంక్షలు విధించనున్నట్లు కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. రెండు వారాలపాటు ఏపీ స‌రిహ‌ద్దుల్లో ఈ ఆంక్షలే అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని స్పష్టంచేశారు.

Also Read: ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక..! 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ.. మిగిలితే ఉద్యోగులకు..?

AP Liquor Shops Timing: ఏపీలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. మధ్యాహ్నం 12గంటల వరకే మద్యం షాపులు

AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో 20వేలకు పైగా కేసులు..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి