ఆ పాడు పని కోసం.. రెండేళ్ల బిడ్డను అమ్ముకున్న కసాయి తండ్రి.. ఆ తర్వాత ఏమైందంటే..?

China Man Sells Two years old baby: మానవత్వం మంటగలిసిపోతోంది. కొందరు డబ్బుకోసం ఏ పని చేయడానికి కూడా వెనుకాడటం లేదు..

  • Ravi Kiran
  • Publish Date - 4:12 pm, Tue, 4 May 21
ఆ పాడు పని కోసం.. రెండేళ్ల బిడ్డను అమ్ముకున్న కసాయి తండ్రి.. ఆ తర్వాత ఏమైందంటే..?
Baby

China Man Sells Two years old baby: మానవత్వం మంటగలిసిపోతోంది. కొందరు డబ్బుకోసం ఏ పని చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఆలిని ఆమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే.. పిల్లలను అమ్మకానికి పెట్టేసే వారు మరికొందరు. కనీసం ఇంగితం లేకుండా భార్యతో హనీమూన్ వెళ్లేందుకు రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు ఓ కసాయి తండ్రి. అలా వచ్చిన డబ్బుతో ఇంచక్కా టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేశాడు. ఈ మొత్తం విషయం పోలీసులకు తెలియడంతో జైలు పాలయ్యాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ పాప, బాబు. అయితే వివాహమైన కొద్దికాలానికి విభేదాలు తలెత్తడంతో ఇరువురి విడిపోయారు. ఈ క్రమంలోనే కోర్టు కూతురు బాధ్యత తల్లికి.. కొడుకు బాధ్యత తండ్రికి అప్పగించింది.

ఉద్యోగస్తుడైన సదరు వ్యక్తికి చిన్నారి బాధ్యతలు చూడటం కష్టం కావడంతో కొద్దిరోజులకు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే రెండో భార్య బిడ్డను చూసుకునేందుకు అంగీకరించలేదు. దీనితో ఆ వ్యక్తి బిడ్డను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. అందులో భాగంగానే ఓ క్రూరమైన ప్లాన్ ఆలోచించాడు.

ఆ ప్లాన్ ప్రకారం కొడుకును చూడాలని కన్నతల్లి కోరిందని.. చిన్నారిని తన కుటుంబసభ్యుల నుంచి తీసుకెళ్లాడు. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ ప్రబుద్దుడు రెండేళ్ల చిన్నారిని సుమారు 18 లక్షలకు అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బుతో రెండో భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు.

ఇక వారం గడుస్తున్నా బాబును తిరిగి తీసుకురాకపోవడంతో.. అనుమానం వచ్చి తండ్రికి కాల్ చేశారు అతడి కుటుంబసభ్యులు. అతడి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తల్లికి కాల్ చేయగా అసలు విషయం బయటపడింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కాగా, చైనాలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!