కోవిడ్ మహమ్మారితో దేశంలో 70 లక్షల జాబ్స్ కి ముప్పు.. రాబోయే నెలల్లో ఎలా ఉంటుందోనన్న నిపుణులు

సెకండ్ వేవ్ కోవిద్ కారణంగా దేశంలో మళ్లీ నిరుద్యోగం తాండవిస్తోంది. అనేక రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్లు విధిస్తున్న కారణంగా దాని ప్రభావం 70 లక్షల ఉద్యోగాలపై పడిందని ముంబైలోని సెంటర్ ఫర్  మానిటరింగ్ ఇండియన్...

కోవిడ్ మహమ్మారితో దేశంలో 70 లక్షల జాబ్స్ కి ముప్పు.. రాబోయే నెలల్లో ఎలా ఉంటుందోనన్న నిపుణులు
Covid 19 Unemployment Rate Rises
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 8:36 PM

సెకండ్ వేవ్ కోవిద్ కారణంగా దేశంలో మళ్లీ నిరుద్యోగం తాండవిస్తోంది. అనేక రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్లు విధిస్తున్న కారణంగా దాని ప్రభావం 70 లక్షల ఉద్యోగాలపై పడిందని ముంబైలోని సెంటర్ ఫర్  మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ తెలిపింది. ఇది దేశంలో నిరుద్యోగం నాలుగు నెలల గరిష్ట స్థాయికి మించి పోవడానికి దారి తీసిందని  ఈ సంస్థ అభిప్రాయపడింది. ఏప్రిల్ లో ఈ సంక్షోభం గత ఏప్రిల్ లో మరీ ఎక్కువగా ఉండిందని ఈ సంస్థ పేర్కొంది. ఇది సగటున 8 శాతం పెరిగినట్టు వివరించింది. అంతకు ముందు మార్చి నెలలో ఇది 6.5 శాతమేనని, కోవిద్ అదుపునకు దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్లు వంటివి విధించడమే ఈ పరిస్థితికి కారణమైందని వెల్లడించింది. 70 లక్షలా జాబ్స్ కోల్పోయామంటే సామాన్య విషయం కాదని ఈ సంస్థ ఎండీ మహేష్ వ్యాస్ వ్యాఖ్యానించారు. దేశంలో కోవిద్ పరిస్థితి మరిన్ని నెలలు కొనసాగితే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని ఆయన అన్నారు.  ఏప్రిల్ లో అర్బన్ ఏరియాల్లో 97.శాతం, రూరల్ ఏరియాల్లో 7.13 శాతం నిరుద్యోగ సమస్య ‘నమోదైనట్టు’ తమ రికార్డులు చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఇక ఆర్ధిక వ్యవస్థపై కోవిడ్ చూపగల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నారు. పూర్తి లాక్ డౌన్ విధిస్తే కలిగే నష్టాలను ప్రస్తుతానికి బేరీజు వేయలేకపోతున్నారని మహేష్ వ్యాస్ అన్నారు. గత ఏడాది కరోనా వైరస్ మొదట్లో ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు ఇండియన్ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండడమే ఇంతటి దుస్థితికి దారి తీసిందని వ్యాస్ అభిప్రాయపడ్డారు. మరి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థితిని ఎలా అధిగమిస్తాయో చూడాల్సి ఉందన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు