Gold Price Today: తగ్గిన బంగారం ధర.. రికార్డు స్థాయి నుంచి రూ. 9 వేల వరకు పతనమైన పసిడి రేటు
Gold Rate Today: గత రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెట్టింది. అయితే బంగారం ధర పెరిగినా కూడా రికార్డు స్థాయి నుంచి చూస్తే.. పసిడి రేటు ఇంకా దిగువ స్థాయిలోనే ..
Gold Rate Today: గత రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెట్టింది. అయితే బంగారం ధర పెరిగినా కూడా రికార్డు స్థాయి నుంచి చూస్తే.. పసిడి రేటు ఇంకా దిగువ స్థాయిలోనే కదలాడుతోంది. భారీగానే పడిపోయిందని చెప్పవచ్చు. తాజాగా గురువారం బంగారం ధర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే.. 10 గ్రాముల బంగారంపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.45,280 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది.
కాగా, బంగారం ధర గత ఏడాది రికార్డు స్థాయిలో నమోదైంది. 2020 ఆగస్టు నెలలో బంగారం ధర ఏకంగా రూ.56,200 స్థాయికి పరుగులు పెట్టింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు బంగారం 25 శాతం పడిపోయింది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర రూ.47 వేల సమీపంలో కదలాడుతోంది. అంటే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర ఇంకా రూ.9 వేలకు పైగానే పడిపోయిందని చెప్పుకోవచ్చు. బంగారం కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.