AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: మీ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ కట్‌ అవుతోందా..? ఎఫ్‌డీ వడ్డీపై పన్ను ఎందుకు విధిస్తారు..!

Fixed Deposit: చాలా మంది సంపాదించిన డబ్బును దాచుకోవడమో.. లేక ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టడమో చేస్తుంటారు. కొందరు బ్యాంకుల్లో ఫిక్స్‌డిపాజిట్‌ (FD) చేస్తే ....

Fixed Deposit: మీ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ కట్‌ అవుతోందా..? ఎఫ్‌డీ వడ్డీపై పన్ను ఎందుకు విధిస్తారు..!
Fixed Deposit
Subhash Goud
|

Updated on: May 05, 2021 | 1:14 PM

Share

Fixed Deposit: చాలా మంది సంపాదించిన డబ్బును దాచుకోవడమో.. లేక ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టడమో చేస్తుంటారు. కొందరు బ్యాంకుల్లో ఫిక్స్‌డిపాజిట్‌ (FD) చేస్తే .. మరి కొందరు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఎటువంటి నష్టం లేకుండా రాబడి పొందాలంటే ఫిక్స్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడమే మంచిది. బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్లీ రేట్లనే అందిస్తున్నాయి. ఎఫ్‌డీలపై ఆదాయంపై పన్ను విధించబడుతుంది. అయినప్పటికీ ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు దీని నుంచి వచ్చే రాబడి, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పేర్కొని పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా సెక్షన్ 80 సి కింద రూ .1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కాగా, టీడీఎస్​ను ఎలా నివారించాలి? ఎఫ్‌డీలపై పన్ను ప్రయోజనాలను ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

ఎఫ్‌డీ వడ్డీపై పన్ను ఎందుకు విధిస్తారు:

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది మీ స్థూల ఆదాయానికి జోడించబడుతుంది. మీ మొత్తం ఆదాయానికి సంబంధించిన స్లాబ్ రేట్లపై పన్ను విధించబడుతుంది. వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాకు జమ చేసినందుకు గాను సంబంధిత బ్యాంకు ఈ పన్నును తీసివేసి మిగిలిన మొత్తాన్ని మీ ఖాతాలో జమచేస్తుంది. మీకు మూడేళ్ల ఎఫ్డీ ఉంటే ప్రతి ఏడాది చివర్లలో టీడీఎస్​ను మినహాయిస్తుంది. అయితే, టీడీఎస్ మినహాయించినప్పటికీ మీ మొత్తం ఆదాయంలో వడ్డీ రాబడిని చేరిస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 31లోపు ఫామ్​ 26 ఏఎస్​ను సంబంధిత బ్యాంకులో సమర్పించాలి. అయితే ఫిక్స్​డ్​డిపాజిట్ల నుండి వచ్చే మొత్తం రాబడి ఏడాదికి రూ.40 వేల కంటే తక్కువగా ఉంటే మీరు ఎటువంటి టీడీఎస్ కట్టాల్సిన అవసరం ఉండదు. అదే, 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్ల విషయంలో మీకు రూ .50 వేల వరకు మినహాయింపు వర్తిస్తుంది.

టీడీఎస్​మినహాయింపు:

అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుండి మీ రాబడి 40 వేల కంటే మించి ఉంటే 10 శాతం టీడీఎస్​ చెల్లించాలి. మీ పాన్​నెంబర్​ను బ్యాంకుకు సమర్పించపోయినట్లయితే మీ డిపాజిట్​ నుంచి 20 శాతం టీడీఎస్​ను తీసివేస్తారు. ఎఫ్‌డీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు టీడీఎస్‌ తీసివేయరు. ఫారం 15జీ, 15 హెచ్​ను సంబంధిత బ్యాంకుకు సబ్​మిట్​ చేయడం ద్వారా టీడీఎస్​ మినహాయింపు పొందవచ్చు.

పోస్టాఫీసు ఎఫ్‌డీలపై టీడీఎస్​ మినహాయింపు:

పన్ను ఆదా చేసుకోవాలంటే మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సాధారణ సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉంటుంది. ఓ వ్యక్తి పాత లేదా ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యాక్స్​ పద్ధతిని ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ఐదేళ్ల లాక్​ ఇన్​ వ్యవధి గల ఫిక్స్‌డ్‌​ డిపాజిట్లపై అకాల ఉపసంహరణ అనుమతించబడదు. ఒకవేళ, డబ్బులు అత్యవసరమైతే ఎఫ్‌డీ ఉపసంహరించుకునే బదులు రుణం తీసుకోవడం లభిస్తుంది. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై టీడీఎస్​కట్​కాకుండా ఉండాలంటే బ్యాంకులకు బదులు పోస్టాఫీసులలో ఫిక్స్‌డ్‌​డిపాజిట్ చేయడమే. పోస్టాఫీస్​ఎఫ్‌డీలపై టీడీఎస్​ఉండదు. ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లలో జమ చేస్తే, డిపాజిటర్లు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 సి కింద 1,50,000 పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం, ఒకటి నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో 5.5 శాతం నుండి 6.7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.