ఐసీయూకి తాళాలు, లోపల మృత దేహాలు, క్యాంటీన్ లో దాక్కున్నవైద్య సిబ్బంది, గుర్ గావ్ ఆసుపత్రిలో దారుణం

గుర్ గావ్ లోని కృతి హాస్పిటల్ లో ఇటీవల జరిగిన ఉదంతం షాక్ నిస్తోంది. 5 రోజుల క్రితం విడుదలైన వీడియోలు చూస్తే వైద్య రంగాన్ని కోవిడ్ ఎలా దెబ్బ తీసిందో తెలుస్తోంది.

ఐసీయూకి తాళాలు, లోపల మృత దేహాలు, క్యాంటీన్ లో దాక్కున్నవైద్య సిబ్బంది, గుర్ గావ్ ఆసుపత్రిలో దారుణం
Videos Show Locked Icu
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 05, 2021 | 9:13 PM

గుర్ గావ్ లోని కృతి హాస్పిటల్ లో ఇటీవల జరిగిన ఉదంతం షాక్ నిస్తోంది. 5 రోజుల క్రితం విడుదలైన వీడియోలు చూస్తే వైద్య రంగాన్ని కోవిడ్ ఎలా దెబ్బ తీసిందో తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలోని ఐసీయూకి సిబ్బంది తాళాలు వేసి పరారయ్యారు. అప్పటికే ఐసీయూలో కొందరు కోవిడ్ రోగులు ఉన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగాఇక తామేమీ చేయలేమని చాలామంది వెళ్ళిపోయినట్టు తెలిసింది. . అయితే కొందరు హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారని కూడా అంటున్నారు. చికిత్స పొందుతున్న రోగులబంధువులు ఈ హాస్పిటల్ కి రాగా ఒక్క డాక్టర్ గానీ, నర్సు గానీ కనిపించలేదు. పైగా ఐసీయూలో కొందరు బెడ్స్ పైనే ఉండగా ఓ రోగి చచ్చిపోతున్నా అని కేకలు పెట్టడాన్ని వీరు గమనించారు. శుక్రవారం రాత్రి ఆరుగురు రోగులు మరణించారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వార్డులు, కేబిన్లు తిరిగినా ఒక్క డాక్టర్ లేదా నర్సు అయినా కనబడకపోవడంతో వీరు మరింత రెచ్చిపోయారు. పేషంట్లకు చికిత్స చేయకుండా వీరిని ఎలా వెళ్ళిపోనిచ్చారని కొందరు పోలీసులతో వాగ్యుధ్డానికి దిగారు. ఓ వైపు తమ వారు మరణిస్తున్నారని, అలాంటిది ఎలా వైద్య సిబ్బందిని అనుమతించారని ఖాకీలను నిలదీశారు. ఆక్సిజన్ కొరతకు, డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆసుపత్రి యజమాన్యానిదే బాధ్యత అని వీరంతా ఆరోపించారు. అయితే ఇటీవల తమ సిబ్బందిపై కొందరు దాడులు చేశారని, దాంతో తానే వారిని దాక్కోమని సలహా ఇచ్చానని ఈ ఆసుపత్రి డైరెక్టర్ స్వాతి రాథోర్ అంటున్నారు. మీ ప్రాణాలను మీరే రక్షించుకోండని సూచించానని, దాంతో కొందరు క్యాంటీన్ లో దాక్కున్నట్టు తెల్సిందని ఆమె చెప్పారు. అయితే ఇప్పడు తమ ఆసుపత్రికి తగినంత ఆక్సిజన్ ఉందని, సమస్య లేదని ఆమె అన్నారు. కాగా జిల్లా అధికారులు మాత్రం తాపీగా ఈ వీడియోలు ఇప్పటివి కావని, పాతవని చెప్పడం కొసమెరుపు.

మరిన్ని ఇక్కడ చూడండి: Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసిన జగన్ సర్కార్ … ( వీడియో )

ఆ ప్రాంతంలో కఠినంగా లాక్ డౌన్.. ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు.. అసలు ఏం చేసిందంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!