Crime News: కూతురిపై లైంగికదాడి.. వద్దన్నందుకు భార్యను చంపేసిన కిరాతకుడు.. ఉరి శిక్ష వేసిన కోర్టు..

Court Judgement: ఆ దుర్మార్గుడు స్వంత కూతురుపైనే లైంగికదాడికి తెగబడ్డాడు. కూతురును ఆ మృగాడి నుంచి రక్షించడానికి తల్లి.. భర్తను హెచ్చరించింది. ఇది తప్పని చెప్పింది. పోలీసులకు చెబుతానని బెదిరించింది.

Crime News: కూతురిపై లైంగికదాడి.. వద్దన్నందుకు భార్యను చంపేసిన కిరాతకుడు.. ఉరి శిక్ష వేసిన కోర్టు..
Crime News
Follow us
KVD Varma

|

Updated on: May 08, 2021 | 1:02 PM

Crime News: ఆ దుర్మార్గుడు స్వంత కూతురుపైనే లైంగికదాడికి తెగబడ్డాడు. కూతురును ఆ మృగాడి నుంచి రక్షించడానికి తల్లి.. భర్తను హెచ్చరించింది. ఇది తప్పని చెప్పింది. పోలీసులకు చెబుతానని బెదిరించింది. దీంతో కోపం పెంచుకున్న ఆ మానవ మృగం తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడు పుదుకోట్టై సమీపంలోని తేనిపట్టిలో ఈ ఘటన జరిగింది. ఇదే ఊరికి చెందిన రైతు మురుగేశన్‌కు ముగ్గురు భార్యలు, పదకొండు మంది పిల్లలు ఉన్నారు. రెండో భార్య 17 ఏళ్ల కుమార్తె పై మురుగేశన్ లైంగిక దాడికి పాల్పడే వాడు. దీంతో భానుమతి ఒకరోజు అతనితో గొడవపడింది. అడ్డుకుంటున్నందుకు ఆమె తలపై రాయితో కొట్టి దారుణంగా చంపేశాడు మురుగేశన్. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. భార్యను హతమార్చిన మానవ మృగం మురుగేశన్‌ (54)కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతే కాకుండా పుదుకోట్టై మహిళా కోర్టు నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించింది.

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడు!

రెండు కుటుంబాలు తెలిసిన కుటుంబాలు. ఒకరితో ఒకరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. ఈ ఇంట్లో అమ్మాయికి.. ఆ ఇంట్లో అబ్బాయికీ పెళ్లి కుదిరింది. రెండు కుటుంబాలలోనూ ఏ అభ్యంతరాలు లేవు. దీంతో అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళింది. అక్కడే ఉంటోంది. అయితే, పెళ్ళికాకుండా శారీరక సంబంధం కావాలని ఆ అబ్బాయి అమ్మాయిని ఒత్తిడి చేశాడు. దానికి అమ్మాయి ససేమిరా అంతా పెళ్లి తరువాతే అనడంతో అమ్మాయిని ఇంటి నుంచి బయటకు రానీయకుండా చేసి ఎనిమిది నెలలుగా పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరాలో చోటుచేసుకుంది. అతని హింస భరించలేని ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కడప జిల్లాల్లో ఘోర ప్రమాదం.. ముగ్గురాయి గనిలో జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుడు.. 9 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌.. డ్రగ్‌ వాసన రాకుండా ఏం చేశారంటే..