కడప జిల్లాల్లో ఘోర ప్రమాదం.. ముగ్గురాయి గనిలో జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుడు.. 10 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Bomb Blast: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్లపల్లె శివారులో ఉన్న ముగ్గురాయి గనిలో ప్రమాదవశాత్తు

కడప జిల్లాల్లో ఘోర ప్రమాదం.. ముగ్గురాయి గనిలో జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుడు.. 10 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Follow us

|

Updated on: May 08, 2021 | 4:06 PM

Bomb Blast: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్లపల్లె శివారులో ఉన్న ముగ్గురాయి గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే జిలిటెన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకువస్తుండగా, ప్రమాదవశాత్తు పేలినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే పేలుడు దెబ్బకు మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. ఈ ముగ్గురాయి గనిలో పనుల కోసం మొత్తం 40 మంది వరకు కూలీలు వచ్చినట్లు సమాచారం. వీరంతా బద్వేలు, పోరుమామిళ్లకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలు గనిలో చిక్కుకుపోగా, బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అయితే మృతులు గంగాయపల్లెకు చెందిన ప్రసాద్‌ (36), పులివెందులకు చెందిన బాల గంగులు (35), సుబ్బారెడ్డి (40), వెంకటరమణ (25), ప్రసాద్‌ (41)లుగా గుర్తించారు. ఇంకా పలువురి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం సంభవించేందేమోనని భయపడినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా..

కాగా, ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇవీ కూడా చదవండి:

విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌.. డ్రగ్‌ వాసన రాకుండా ఏం చేశారంటే..

Murder: రూ.3 వేలు అడిగినందుకు భార్యను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన కసాయి భర్త.. కేసు నమోదు