Andhra Farmers: కరోనాతో సతమతమవుతున్న ఏపీ రైతాంగానికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్
కరోనాతో సతమతమవుతున్న ఏపీ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో మాదిరిగానే రైతుల నుంచి పంటలను నేరుగా ప్రభుత్వమే...
కరోనాతో సతమతమవుతున్న ఏపీ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో మాదిరిగానే రైతుల నుంచి పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై సీఎం జగన్ ఉన్నతాధికరులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పక్కాగా జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలను చైతన్యం చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందో సూచిస్తూ ప్రభుత్వంతో వ్యవసాయ కమిటీలు అనుసంధానమై పనిచేస్తాయన్నారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళుతుందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. జిల్లాల కలెక్టర్లు గోనె సంచులు సమీకరించుకోవాలి. వ్యయ నియంత్రణ సాకుతో ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు ధాన్యం పంపించవద్దన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖలు రెండూ సమన్వయంతో కలిసి పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతులు కోరిన విత్తనాలను పౌర సరఫరాల శాఖ అందించాలి. రైతులు బయట విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలి. పంటల సాగు నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలని సీఎం ఆదేశించారు. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండేలా చూడాలన్నారు.
కరోనా సమయంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా లోపం లేకుండా చూడాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సిన తూకం యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో బియ్యం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: ఆ రాశివారు ఏ పని చేపట్టినా విజయం స్సాదిస్తారంట… శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..