Horoscope Today: ఆ రాశివారు ఏ పని చేపట్టినా విజయం స్సాదిస్తారంట… శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ప్రతి రోజూ రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని రోజును ప్రారంభిస్తుంటారు.
Horoscope Today: మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ప్రతి రోజూ రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని రోజును ప్రారంభిస్తుంటారు. అలాంటి వారు రోజులో చేపట్టాల్సిన పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి లాంటి వివరాలు తెలుసుకొని రోజును ప్రారంభించడం ఉత్తమం. మరి శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
మేష రాశి: మేష రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల విషయంలో ఏమాత్రం తొందరపడకపోవడం మంచింది.ఆర్ధిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. సూర్యనారాయణ అర్చన ఆరాధనా మంచింది .
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగతం గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచి. ఐశ్వర్య లక్ష్మీపూజ మేలు చేస్తుంది.
మిథున రాశి: మిథున రాశి వారు ఈరోజు కష్టమైన పనులు చేపడుతుంటారు. వేరు వేరు పనుల్లో వ్యతిరేక భావాలు , ప్రత్యర్ధులు కొంత తగ్గిపోతుంటారు. మంచి మంచి వార్తలు వింటుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో బంధువులతో విబేధాలు రాకుండా చూసుకోవాలి. చేసేపనుల్లో జాగ్రత్త వహించాలి.
సింహ రాశి: సింహ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. వ్యక్తిగత ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.
కన్య రాశి: ఈ రాశి వారు ఈరోజు వృత్తి, వ్యాపార విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల గురించి ఆలోచన చేస్తుంటారు . సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
తులా రాశి: తులా రాశి వారికి రావాల్సిన పేరు ప్రఖ్యాతలు అందుకుంటారు. గౌరవ మర్యాదలు కోల్పోకుండా కొన్ని సందర్భాల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు కుటుంబ పరంగా కొన్ని దైవ కార్యక్రమాలు చేపట్టకలుగుతారు. సంఘంలో గౌరవాలు ఏర్పడుతుంటాయి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ప్రయాణ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దుర్గ అమ్మవారి ఆరాధనా మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆస్తి లాభాలు కూడా దక్కుతాయి. కార్య సిద్ది వలన కొన్ని ఉన్నత స్థాయిని పొందుతారు. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవడం మంచింది.
కుంభ రాశి: కుంభ రాశి వారు వ్యవహారికి విషయాల్లో విజయాలు సాధిస్తారు. కొన్ని శుభవార్తలు ఆనందాన్ని కలుగ జేస్తుంటాయి. గణపతి దర్శనం మంచింది.
మీన రాశి: ఈ రాశి వారు కీలక మైన చర్చలు, నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :