Vijay Devarakonda: తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన విజయ్.. కరోనాపై అవగాహన కల్పిస్తోన్న రౌడీ హీరో..
Vijay Devarakonda: ప్రస్తుతం దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాజాగా...
Vijay Devarakonda: ప్రస్తుతం దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాజాగా కరోనా నుంచి కోలుకొని ప్రగతి భవన్‌కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కరోనా కట్టడికి ప్రణాళికలు రచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్ మందుల కిట్‌ను వాడండని సూచించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. ప్రజల్లో కరోనా ట్రీట్‌మెంట్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే.. టెస్ట్ కోసం సమయాన్ని వృథా చేయకుండా వెంటనే ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలని సూచించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడిన ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పిన విజయ్.. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే అక్కడ ఉన్న వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపించగానే టెస్ట్ కోసం సమయాన్ని వృథా చేయకుండా ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలని విజయ్ చెప్పుకొచ్చాడు.
విజయ్ చెప్పిన కరోనా సూచనలు..
Hero @TheDeverakonda talks about precautions to take if you have #COVID19 symptoms.
Stay Strong, Stay Safe.! pic.twitter.com/y8TJY6Houd
— BARaju (@baraju_SuperHit) May 7, 2021
Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యాధికారులకు పలు సూచనలు