AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Covid Vaccine: తెలంగాణలో మొదటి డోసు కరోనా టీకా నిలిపివేత.. రేపటి నుంచి వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలని సర్కార్ నిర్ణయం

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి కోవిడ్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.

TS Covid Vaccine: తెలంగాణలో మొదటి డోసు కరోనా టీకా నిలిపివేత.. రేపటి నుంచి వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలని సర్కార్ నిర్ణయం
Corona Vaccine Doses
Balaraju Goud
|

Updated on: May 07, 2021 | 6:18 PM

Share

Telangana Covid Vaccine: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి కోవిడ్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు వెల్లడించింది. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 18 – 44 ఏళ్ల వారికి ఇవ్వాల్సిన టీకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

గతంలోనే దాదాపు 30 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేవలం 15 నుంచి 16 లక్షల డోసులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డోసుల కొరత కారణంగా ఇప్పటికే మూడు, నాలుగు సార్లు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివేసింది ఆరోగ్య శాఖ. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడడంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తొలి డోసు ప్రక్రియను నిలిపివేస్తూ కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని తాజాగా ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో మే1 నుంచి 18ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే టీకాల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణుల కమిటీ తీసుకునే నిర్ణయం టీకాల సరఫరా, తయారీ సంస్థలపై నెలకొన్న ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడడంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. వీరికి సకాలంలో రెండో డోసు ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా మొదటి డోసు ప్రక్రియను నిలిపివేస్తూ తాజాగా ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

Read Also…. అధిక బీపీ ఉన్నవారికి కొవిడ్ ప్రమాదం..? ఈ విషయాలు తెలుసుకొని.. కరోనా నుంచి జాగ్రత్త పడండి..!

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో