తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

Telangana Night Curfew: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు పాజిటివ్‌ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటం...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

Telangana Night Curfew: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు పాజిటివ్‌ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన నైట్ కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగించింది.

రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న నైట్‌ కర్ఫ్యూను మే 15వ తేదీ వరకు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనలే మే 15 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 9 తర్వాత ఎవరూ బయట తిరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పెళ్ళిళ్ళకు 100 మంది అతిధులను అనుమతించిన ప్రభుత్వం.. అంత్యక్రియలకు 20 మంది మించకూడదని సూచించింది. అటు సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద కార్యక్రమాలు, విద్య, మత. సంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

తెలంగాణలో కొత్త‌గా 5,892 మందికి కరోనా.. 46 మరణాలు..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. కొత్తగా 5892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 9122 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,05,164 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2625గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73,851 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కొత్తగా 1104 కేసులు నమోదు అయ్యాయి.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?

Goms

Goms