Andhra Corona : తూర్పు గోదావరి జిల్లాలో.. ఆ ఊరంతా పాజిటివ్‌లే..రోజూ మరణాలే!
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గొల్లవెల్లి గ్రామాన్ని కరోనా కబళిస్తోంది. గ్రామంలో...
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గొల్లవెల్లి గ్రామాన్ని కరోనా కబళిస్తోంది. గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉప్పలగుప్తం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గడిచిన పది రోజుల్లో సుమారు ఇరవై నుండి 30 మంది వరకు కరోనా తో మృతి చెందారు. గ్రామంలో దాదాపు 80 శాతం మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. తమ గ్రామాల్లో కి ఎవరూ రావడం లేదని, తమను కూడా ఎవరు రానివ్వడం లేదని, తమకు నిత్యవసర వస్తువులు కూడా తెచ్చి ఇచ్చే వారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, గ్రామంలో ప్రతి రోజు ఇద్దరు చొప్పున మరణించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి గానీ, నాయకుడు కానీ తమ గ్రామానికి రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి పెట్టి సరైన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. విషయం తెలిసిన మంత్రి విశ్వరూప్ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. గ్రామాన్ని కట్టుదిట్టం చేయాలని, ప్రజలకు అవసరమైన నిత్యవసరాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. గ్రామంలో కరోన కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు.
డీఆర్డీఓ సరికొత్త ఆవిష్కరణ… సెకన్లలోనే కరోనా టెస్ట్… కచ్చితత్వం 96.73 శాతం