Ravinder Pal Singh: మరో మాజీ క్రీడాకారుడిని కాటేసిన కరోనా.. హాకీ దిగ్గజం రవీందర్‌పాల్ సింగ్ కన్నుమూత

కరోనా మహమ్మారి ధాటికి మరొక క్రీడాకారుడు బలయ్యారు. భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన రవీందర్‌పాల్‌ సింగ్‌ (60) శనివారం ఉదయం కోవిడ్‌ బారిన పడి కన్నుమూశారు.

Ravinder Pal Singh: మరో మాజీ క్రీడాకారుడిని కాటేసిన కరోనా.. హాకీ దిగ్గజం రవీందర్‌పాల్ సింగ్ కన్నుమూత
Indian Hockey Player Ravinder Pal Singh
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2021 | 2:17 PM

Indian hockey player Ravinder Pal Singh: కరోనా మహమ్మారి ధాటికి మరొక క్రీడాకారుడు బలయ్యారు. భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన రవీందర్‌పాల్‌ సింగ్‌ (60) శనివారం ఉదయం కోవిడ్‌ బారిన పడి కన్నుమూశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ విజేత జట్టులో ఆయన సభ్యుడుగా ఉన్నారు. ఏప్రిల్‌ 24న రవీందర్ సింగ్‌కు కరోనా వైరస్‌ సోకడంతో లక్నోలోని వివేకానంద ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. వైరస్‌ నుంచి కోలుకోవడం, నెగెటివ్‌ రావడంతో గురువారం ఆయనను సాధారణ వార్డుకు తరలించారు. అయితే, శుక్రవారం హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు.

రవీందర్‌పాల్‌ సింగ్‌ భారత జట్టు తరుఫున ఆడి తన అత్యుత్తమ క్రీడా ప్రతిభతో ఆకట్టుకున్నారు. 1979లో జూనియర్‌ ప్రపంచకప్‌లోనూ ప్రాతినిధ్యం వహించారు. కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్‌ జూబ్లీ కప్‌ (హాంకాంగ్‌), 1982 ప్రపంచకప్‌ (ముంబయి), 1982 ఆసియా కప్‌ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1984 లాస్‌ ఏంజెల్స్‌‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. ఆయన వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని హాకీ ఆటకే అంకితం చేశారు. కాగా, ఆయన మేనకోడలు ప్రగ్యా యాదవ్‌ ఇప్పటి వరకు ఆయనను చూసుకున్నారు. రవీందర్ సింగ్ మరణం పట్ల హాకీ ఇండియా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Read Also… Andhra Corona : తూర్పు గోదావ‌రి జిల్లాలో.. ఆ ఊరంతా పాజిటివ్‌లే..రోజూ మరణాలే!

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!