ఇండియాలో వెల్లువెత్తిన యూపీఐ చెల్లింపుల లావాదేవీలు, గూగుల్ పే ని అధిగమించిన ఫోన్ పే

దేశంలో డిజిటల్ చెల్లింపుల పుణ్యమా అని ఫోన్ పే ముందుకు దూసుకుపోయింది. గత ఏప్రిల్ లో యూపీఐ (యూనిఫైడ్ పే మెంట్ ఇంటర్ ఫేస్) చెల్లింపుల్లో ఫోన్ పే తన మార్కెట్ షేర్ ని బాగా పెంచుకోగల్గింది.

  • Publish Date - 3:02 pm, Sat, 8 May 21 Edited By: Anil kumar poka
ఇండియాలో వెల్లువెత్తిన యూపీఐ చెల్లింపుల లావాదేవీలు, గూగుల్ పే ని అధిగమించిన ఫోన్ పే
Gpay Ppay

దేశంలో డిజిటల్ చెల్లింపుల పుణ్యమా అని ఫోన్ పే ముందుకు దూసుకుపోయింది. గత ఏప్రిల్ లో యూపీఐ (యూనిఫైడ్ పే మెంట్ ఇంటర్ ఫేస్) చెల్లింపుల్లో ఫోన్ పే తన మార్కెట్ షేర్ ని బాగా పెంచుకోగల్గింది. గూగుల్ పే ని కూడా అధిగమించింది. నేషనల్ పే మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీ సి ఐ)డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. గూగుల్ పే ని అధిగమించడం ద్వారా 45 శాతం మార్కెట్ షేర్ ని సంపాదించుకోగలిగింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరగడంతో డిజిటల్ చెల్లింపుల సిస్టం కూడా బిజినెస్ పెరగడానికి దోహదపడింది. ట్రెండ్ ను బట్టి చూస్తే రానున్న సంవత్సరాల్లో యూపీఐ విధానం ఇంకా పెరుగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. మార్చి నెలలో ఫోన్ పే మార్కెట్ షేర్ 43.91 శాతం ఉండగా ఏప్రిల్ నాటికీ అది 45 శాతానికి పెరిగింది. కాగా గూగుల్ పే మార్కెట్ షేర్ 34.3 శాతం ఉంది. ఏప్రిల్ లో 4,93,663 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయని నేషనల్ పే మెంట్స్ కార్పొరేషన్ తెలిపింది. ఇది మార్చిలో రికార్డ్ అయిన 5 లక్షల కోట్ల విలువైన లావాదేవీల కన్నా దాదాపు 14 శాతం తక్కువని ఈ సంస్థ వెల్లడించింది.
మార్చినెలలో 5,04,886 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. యూపీఐ పే మెంట్ ప్లాట్ ఫామ్స్ లో ఫోన్ పే 234023.33 కోట్లవిలువైన లావాదేవీలతో మొదటి స్థానంలో ఉంది. ఇది మొత్తం లావాదేవీల వ్యాల్యులో 47 శాతం ఎక్కువట. ఇక గూగుల్ పే, పేటీ ఎం, అమెజాన్ పే, యాక్సిస్ బ్యాంక్ వంటి ఆరు సంస్థలు టాప్ లావాదేవీలు జరిపిన సంస్థల్లో ఉన్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :

ఊరు ఊరంతా ఐసోలేషన్‌!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.