AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barat Video: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పొదలు, పంట పొలాల్లో పెళ్లి బరాత్.. చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు

Funny Barat Video: కరోనా కాలంలో పలుచోట్ల చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సంఘటనలు కాస్త సోషల్ మీడియాలోకి

Barat Video: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పొదలు, పంట పొలాల్లో పెళ్లి బరాత్.. చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు
Barat Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 08, 2021 | 3:15 PM

Funny Barat Video: కరోనా కాలంలో పలుచోట్ల చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సంఘటనలు కాస్త సోషల్ మీడియాలోకి వచ్చి రాగానే తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూడగానే.. కొన్ని నవ్వును తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. అంతేకాకుండా మరికొన్ని వీడియోలు మనం ఎలా ఉండాలో బోధిస్తాయి. అయితే కరోనా కాలంలో వెలుగులోకి వస్తున్న వీడియోలు ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు నవ్వుకునేలా చేస్తున్నాయి. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పెళ్లి ఊరేగింపు చాలా ప్రత్యేకమైన రీతిలో జరిగింది.

పెళ్లి రోజు ప్రత్యేకమైనది ఉండాలని.. ఏదేదో చేస్తుంటారు. ఎందుకంటే.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఊరేగింపు నిర్వహిస్తుంటారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వివాహంపై లాక్డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, అతను తన పెళ్లి ఊరేగింపును చెట్లు పొదల నుంచి రహస్యంగా జరుపుకుంటున్నాడు. పంట పొలాల నుంచి బరాత్ ఎలా వస్తుందో ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. బ్యాండ్ ముందు మధ్యలో వరుడు.. వెనుక వైపు కుటుంబసభ్యులు వస్తున్నారు. ఈ వీడియోలో పెళ్లి కొడుకు కూడా నవ్వుతున్నాడు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగలేదంటూ పేర్కొంటున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.

వైరల్ వీడియో..

ప్రస్తుతం ఈ వీడియో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో క్యాప్షన్‌లో హిలేరియస్ ఊరేగింపు అంటూ రాశారు. వేలాది మంది ఈ వీడియోను చూడగా.. వందలాది మంది దీనిని షేర్ చేసి నవ్వుకుంటున్నారు.

Also Read:

Jathi Ratnalu Sequel: ‘జాతిరత్నాలు’ సీక్వెల్‌కు రంగం సిద్దం.. స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ అనుదీప్‌..

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!