Corona Test: డీఆర్డీఓ సరికొత్త ఆవిష్కరణ… సెకన్లలోనే కరోనా టెస్ట్… కచ్చితత్వం 96.73 శాతం
అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)....
అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) కోవిడ్ -19 ను గుర్తించడంలో సహాయపడటానికి ఒక కృత్రిమ మేధస్సు (AI) అల్గోరిథంను సృష్టించాయి. ఈ అల్గోరిథం ప్రకారం చెస్ట్ ఎక్స్ రే తీయడం ద్వారా ఈజీగా కోవిడ్ ను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డెవలపర్ల తెలిపిన వివరాల ప్రకారం, ఛాతీ ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ఉపయోగించిన ఆత్మన్ ఏఐ అనే సాధనం వైరస్ ను గుర్తిచడంలో 96.73 శాతం ఖచ్చితత్వ రేటును చూపించింది. కరోనా రోగులను వేగంగా గుర్తించడానికి, సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడటానికి…. ఫ్రంట్‌లైన్‌లోని వైద్యులకు సహాయం చేయడానికి డీఆర్డీఓ.. ఈ డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ యూకే సింగ్ చెప్పారు.
ఎక్స్-రే ఉపయోగించి వైరస్ ను డిటెక్ట్ చేయడం చాలా వేగవంతమైన పని అని, తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని ఈ పరిశోధన చేసిన టీమ్ పేర్కొంది. సిటి స్కాన్లు అందుబాటులో లేని మన దేశంలోని చిన్న పట్టణాల్లో చాలా ఉపయోగకరమైన సాధనంగా ఉంటుందని, ఇది రేడియాలజిస్టులపై భారాన్ని తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. చెస్ట్ ఎక్స్-రే లోని ఏఐ సాధనం ఉపయోగించి రోగిలో వ్యాధి వ్యాప్తి ఏ దశలో ఉందో గుర్తించవచ్చని.. దీని ద్వారా చికిత్స కూడా సులభతరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
కాగా దేశంలోని రేడియాలజిస్టుల డిజిటల్ నెట్‌వర్క్.. 5 సి నెట్‌వర్క్, హెచ్‌సిజి అకాడెమిక్స్ సహకారంతో దేశంలోని దాదాపు 1000 ఆసుపత్రులలో ఈ సాధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ సాంకేతిక ద్వారా కరోనాను కొన్ని సెకన్లలో కనుగోవచ్చని హెచ్‌సీజీ అకాడమిక్స్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ టూల్ ద్వారా ప్రస్తుతం ఆస్పత్రులలో సీటీ స్కాన్ మెషీన్లపై పడుతున్న భారం కొంత తగ్గుతుందని హెచ్‌సీజీ అకాడమిక్స్ అభిప్రాయపడింది.