New Guidelines: దేశంలో కరోనా మహోగ్రరూపం.. పాజిటివ్‌ రిపోర్ట్‌ లేకున్నా ఆసుపత్రుల్లో చేరవచ్చు.. కేంద్రం కొత్త మార్గదర్శకాల విడుదల

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

New Guidelines: దేశంలో కరోనా మహోగ్రరూపం.. పాజిటివ్‌ రిపోర్ట్‌ లేకున్నా ఆసుపత్రుల్లో చేరవచ్చు.. కేంద్రం కొత్త మార్గదర్శకాల విడుదల
Health Ministry Releases Revised Guidelines
Follow us

|

Updated on: May 08, 2021 | 3:35 PM

Health ministry Releases Revised Guidelines: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రుల్లో చేర్చుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, శుక్రవారం హోం ఐసోలేషన్‌‌లో ఉన్నవారికి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 10 రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా180 జిల్లాల్లో గ‌త వారంరోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కాలేద‌ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రక‌ట‌న చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గ‌త 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేద‌ని ఆ ప్రక‌ట‌న‌లో తెలిపింది. 54 జ‌ల్లాల్లో అయితే గ‌త మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేద‌ని వెల్లడించింది.

Read Also…కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించే తేనెటీగలు, నెదర్లాండ్స్ లో శిక్షణ నిస్తున్న రీసెర్చర్లు,

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు