గుజరాత్, ఢిల్లీ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కోవిడ్ ఇన్ఫెక్షన్, మరో ఆందోళనతో తల్లడిల్లుతున్న రోగులు

గుజరాత్ ఢిల్లీ ఆసుపత్రుల్లో కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రోగులకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యుకోర్ మైకోసిస్; అనే కొత్త రకం బ్లాక్ ఫంగస్ కారణంగా వీరికి దాదాపు ప్రాణాంతక పరిస్థితి ఏర్పడింది.

గుజరాత్, ఢిల్లీ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కోవిడ్ ఇన్ఫెక్షన్, మరో ఆందోళనతో తల్లడిల్లుతున్న రోగులు
Gujarat Hospital Reports Rise In Covid Cases With Black Fungus
Follow us

| Edited By: Phani CH

Updated on: May 08, 2021 | 4:32 PM

గుజరాత్ ఢిల్లీ ఆసుపత్రుల్లో కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రోగులకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యుకోర్ మైకోసిస్; అనే కొత్త రకం బ్లాక్ ఫంగస్ కారణంగా వీరికి దాదాపు ప్రాణాంతక పరిస్థితి ఏర్పడింది. అహ్మదాబాద్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 20 రోజుల్లో ఈ ఎన్ టీ వార్డులోని 67 మంది రోగులను ఈ లక్షణాలు ఉన్నవారిగా గుర్తించామని, బీజే మెడికల్ కాలేజీ ఆసుపత్రి డాక్టర్ కల్పేష్ పాటిల్ తెలిపారు. వీరిలో 45 మందికి ఇంకా సర్జరీలు చేయాల్సి ఉందన్నారు. రోజూ ఏడెనిమిది మందికి ఆపరేషన్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రి వైద్యులు ఇటీవల తెలిపిన కొద్ధి రోజులకే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గత రెండు రోజులలో తాము ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులకు సంబంధించి ఆరుగురు రోగులను అడ్మిట్ చేసుకున్నామని డాక్టర్లు తెలిపారు. గత ఏడాది ఈ కొత్త ఫంగల్ కారణంగా కొందరి కంటి చూపు పోయిందని, వారి ముక్కు, దవడలను తొలగించాల్సి వచ్చిందని ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి ఈ ఎన్ టీ సర్జన్ డాక్టర్ మనీష్ ముంజాల్ తెలిపారు. కోవిడ్ రోగుల చికిత్సలో స్టెరాయిడ్స్ ని వాడడం ఇందుకు కారణమవుతున్నట్టు కనిపిస్తోందని ఈ డిపార్ట్ మెంట్ హెడ్ అజయ్ స్వరూప్ చెప్పారు. రోగుల్లో చాలామంది డయాబెటిస్ తో బాధ పడుతున్నవారు కూడా ఉన్నారన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఈ స్టెరాయిడ్స్ వ్యాధి నిరోధక శక్తిని ఇంకా తగ్గిస్తాయని ఆయన అన్నారు. మేము ఇస్తున్న మందుల్లో కొన్ని హై డోసులు గలవి ఉంటున్నాయని ఆయన అంగీకరించారు. ఇవి ఇమ్యూన్ సిస్టం ని ఇంకా తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ నగర ఆసుపత్రిలో ఏడుగురికి కంటి చూపు పోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Old Woman in Well: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు గంటలు బావిలో గడిపిన 80 ఏళ్ల బామ్మ.. పోలీసుల రాకతో క్షేమం!

Viral Video: అరటి తోటలో ఏనుగులు బీభత్సం.! నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకంటే.!