AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: మరో ఇండియా వ్యాక్సిన్.. త్వరలో అందుబాటులోకి జైడస్ టీకా.?

మే 1 నుంచి రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా ఇప్పుడు మరో వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి...

Covid Vaccine: మరో ఇండియా వ్యాక్సిన్.. త్వరలో అందుబాటులోకి జైడస్ టీకా.?
Corona Vaccine
Ravi Kiran
|

Updated on: May 08, 2021 | 4:59 PM

Share

Zydus Cadila Vaccine: ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేస్తున్నా రెండు డోసులు ఇవ్వడానికి అధిక సమయం పడుతున్నది. మే 1 నుంచి రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా ఇప్పుడు మరో వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్ డి అనే వ్యాక్సిన్ ను రెడీ చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అతి త్వరలోనే మధ్యంతర ఫలితాలు రాబోతున్నాయి.

ఈ నెలలోనే టీకాకు అనుమతులు లభిస్తాయని జైడస్‌ విశ్వాసంగా ఉంది.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైకోవ్‌-డి మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను సంస్థ ప్రారంభించింది. 28వేల మందిపై ప్రయోగాలు జరిపింది. అతి త్వరలోనే ఈ టీకా మధ్యంతర సామర్థ్య ఫలితాలు రానున్నాయట. ఆ ఫలితం వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు జైడస్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ ఇటీవల వెల్లడించారు. మే నెలలోనే తమ టీకాకు అనుమతులు లభించే అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అత్యవసర అనుమతులు లభించిన వెంటనే టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామని, నెలకు కోటి డోసుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్రం ఆమోదముద్ర వేస్తే జైకోవ్‌-డి దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా ఇదే కానుంది. అయితే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి మాదిరిగా కాకుండా.. ఇది మూడు డోసుల టీకా. మొదటి డోసు వేసుకున్న నెల రోజులకు రెండో డోసు.. ఆ తర్వాత మరో నెలకు మూడో డోసు వేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. మూడు డోసుల వల్ల అధిక రోగనిరోధక శక్తి లభించడంతో పాటు యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ చెబుతోంది. జైడస్‌ క్యాడిలా తయారుచేసిన విరాఫిన్‌ ఔషధానికి ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. ఒకే మోతాదులో వాడే ఈ యాంటీ వైరల్‌ ఇంజక్షన్‌ను.. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా ఇస్తారు.

ఇవీ చదవండి:

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!