Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!

Viral News Update: సోషల్ మీడియాలో కొంతమంది తమకు తాము టైమ్ ట్రావెలర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రపంచానికి...

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!
Earth
Follow us
Ravi Kiran

|

Updated on: May 06, 2021 | 10:04 PM

Viral News Update: సోషల్ మీడియాలో కొంతమంది తమకు తాము టైమ్ ట్రావెలర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రపంచానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా చెబుతుంటారు. తాజాగా టిక్‌టాక్ యూజర్ ఒకరు ఓ ఇంటరెస్టింగ్ విషయం బయటపెట్టాడు. 2026 జూన్ 6వ తేదీన, ప్రపంచం మొత్తం మూడు రోజులు పాటు అంధకారంలో వెళ్లిపోతుందని చెబుతున్నాడు. ఆ యూజర్ కు చెందిన ఐడీ పేరు @ timetraveler2582. అతడు 2582 సంవత్సరానికి వెళ్లి వచ్చినట్లుగా పేర్కొన్నాడు.

@ timetraveler2582 అనే ఐడీ కలిగిన ఓ టిక్‌టాక్ యూజర్ జూన్ 6, 2026న, ప్రపంచం మొత్తం మూడు రోజులు అంధకారంలో ఉంటుందని చెబుతున్నారు. “ఆ సమయంలో ప్రజలు ఎక్కడా కాంతిని చూడలేరని” అన్నాడు. ఇక అతడు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ఫోలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ వాదనకు అతడు ఎలాంటి ఆధారాలు చెప్పలేదు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అసలు ఇదంతా నిజమేనా అని అడుగుంటే.. మరికొందరు ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఇలాంటి ట్రిక్స్ వాడటం ఈ మధ్య అందరికి అలవాటైందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?