Covid-19: కరోనాతో కుటుంబ పెద్ద మరణించాడని.. భార్య, ఇద్దరు కుమారులు బలవన్మరణం..
Suicide: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగువేల
Suicide: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగువేల మంది మరణిస్తున్నారు. ఈ మహమ్మారి నిత్యం వందలాది కుటుంబాలకు శోకసంద్రంలో ముంచుతోంది. మరెన్నో కుటుంబాలకు అండలేకుండా చేస్తోంది. తాజాగా గుజరాత్‌లో కోవిడ్ -19తో ఒక వ్యక్తి మృతి చెందడంతో.. అతని భార్య ఇద్దరు కుమారులతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన దేవభూమి ద్వారకలో చోటుచేసుకుంది.
ఈ విషాద సంఘటన గురించి పోలీసులు శనివారం వెల్లడించారు. దేవభూమి-ద్వారక జిల్లాలో ఒక ఇంట్లో సాధనబెన్ జైన్ (57), ఆమె కుమారులు కమలేష్ (35), దుర్గేష్ (27) మృతదేహాలు లభించాయని ఇన్‌స్పెక్టర్ పీబీ గఢవి వెల్లడించారు. కుటుంబ పెద్ద జయేష్ భాయ్ జైన్ (60) కోవిడ్ బారిన పడి మరణించారని తెలిపారు. ఆయన మరణం అనంతరం కలత చెందిన భార్య, ఇద్దరు కుమారులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జయేశ్‌భాయ్ శుక్రవారం ఉదయం మరణించగా.. సాయంత్రం ఆరు గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం భార్య, ఇద్దరు కుమారులు తట్టుకోలేక రాత్రి 8గంటల సమయంలో పురుగుల మందు తాగి మరణించారు. వారి బంధువులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: