Police Firing: బ్రెజిల్ లో పేద, నల్ల జాతీయులపై పోలీసులు కాల్పులు..28 మంది మృతి..ఐక్యరాజ్యసమితి సీరియస్!
Police Firing In Brazil: నిషేధిత డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం జరుగుతోందన్న కారణంగా బ్రెజిల్ లోని రియో డే జనీరో స్లమ్(మురికి వాడ)లో పోలీసులు దాడులు చేశారు.
Police Firing In Brazil: నిషేధిత డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం జరుగుతోందన్న కారణంగా బ్రెజిల్ లోని రియో డే జనీరో స్లమ్(మురికి వాడ)లో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 25 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సీరియస్ గా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం(యూఎన్ హెచ్ఆర్సీ) స్పందించింది. బ్రెజిల్ పోలీసులు అత్యుత్సాహంతో అనవసరంగా కాల్పులకు పాల్పడ్డారని ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది యూఎన్ హెచ్ఆర్సీ. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
రియోడే జనీరోలోని మురికి వాడలపై హాలీవుడ్ సినిమా తరహాలో పోలీసుల దాడులు చేశారు. రియోడే జనీరోలోని అతిపెద్ద స్లమ్ ప్రదేశాల్లో జకారేజిన్హో ప్రాంతం ఒకటి. ఇక్కడ నివసిస్తున్న వారిలో పేదలు ముఖ్యంగా శ్వేత జాతీయేతరులు అధికంగా ఉంటారు. ఇక్కడ క్రిమినల్ గ్యాంగ్స్ దే హవా. దేశంలోని లీడింగ్ గ్యాంగ్స్ కు ఈ ప్రాంతం పెట్టింది పేరు. బ్రెజిల్ అతి పురాతనమైన క్రిమినల్ గ్యాంగ్ గా పేరుపడ్డ కమాండో వెర్మెల్హో. రెడ్ కమాండ్ గా కూడా దీన్ని పిలుస్తుంటారు.
1970లో రియోడే జనీరోలోని జైలులో ఖైదీలు స్వీయ రక్షణకు ఈ గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు.ప్రారంభంలో చిన్న చిన్న నేరాలు దోపిడీలు, బ్యాంక్ లూటీలు రెడ్ కమాండ్ చేసేది. క్రమేపీ..1980లో.. కొకైన్ వ్యాపారం, కొలంబియన్ డ్రగ్ కార్టెల్ తో కలిసి వ్యాపారం ప్రారంభించింది. ప్రస్తుత డ్రగ్ ట్రాఫికింగ్ పై నియంత్రణకోసం మరో క్రిమినల్ గ్యాంగ్ పీసీసీ తో రెడ్ కమాండ్ పోటీ పడుతోంది. ఈ రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణలు ఇక్కడ సాధారణం.
హెలికాప్టర్లతో పోలీసుల దాడి..
జకారేజిన్హో మురికివాడలో అత్యంత జన సమ్మర్ధం ఉన్న సమయంలో ఒక్కసారిగా 200 మంది సాయుధ పోలీసులు(Police Firing In Brazil) హెలీకాప్టర్లలో వచ్చి విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు మరణించవారిన వారి సంఖ్య 28. ఘటన జరిగిన రోజు(గురువారం) ఐక్యరాజ్య సమితి ప్రకటన ప్రకారం మరణించిన ప్రజల సంఖ్య 24. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి కూడా మృతి చెందారు. ఈరోజు (8-5-2021) ఫావెలా ప్రాంతంలో మరో మూడు మృత దేహాలు లభ్యం అయ్యాయి. సంఘటన తరువాత మృతి చెందిన వారంత డ్రగ్ డీలర్లని పోలీసులు ప్రకటించారు. డ్రగ్ డీలర్లు కూడా పోలీసులపై కాల్పులు జరపారని స్థానిక పోలీస్ చీఫ్ అల్లన్ టర్నోవిస్కీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐక్య రాజ్య సమితి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థల ఖండన
బ్రెజిల్ కాల్పుల ఘటనను ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం సహా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు ఖండించాయి. ‘ఇది అమానవీయ చర్య. పోలీసులు మానవ హక్కులను కాలరాశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా పేద, నల్ల జాతీయలు. వారి ప్రాణాలను తీసి పోరు నరమేధం చేశారని విమర్శించాయి. శనివారం ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల విభాగం అధికార ప్రతినిధి రూపర్ట్ కోల్ విల్లే ఒక ప్రకటన చేస్తూ.. ‘ అసంబద్ధంగా, అవసరంలేకున్నప్పటికీ పోలీసులు(Police Firing In Brazil) వ్యవహరించారు. ఇది పేద వారిపై దాడి. ఈ ఘటనపై అంతర్జాతీయ నిబంధనలు, ప్రమాణాల ప్రకారం స్వంతంత్ర దర్యాప్తు జరిపించాలి. ‘ అని వ్యాఖ్యానించారు.
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్ అండ్ క్రైమ్స్(యుఎన్ ఓడీసీ) ప్రచురించిన వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2020 ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి- 2019లో అంచనా.
- అక్రమంగా పండిస్తున్న ఓపియం పాపి 2,40,800 హెక్టార్లు
- ఒవెన్ డ్రై ఓపియం ఉత్పత్తి 7,610 టన్నులు
- హెరాయిన్ ఉత్పత్తి 472-722 టన్నులు
- కోకా బుష్ అక్రమ సాగు 2017లో… 2,45,400 హెక్టార్లు
- వంద శాతం శుద్ధమైన కొకైన్ ఉత్పత్తి అంచనా 2018లో.. 1,723 టన్నులు.
- ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో మారిజునా సాగుచేస్తు మాదక ద్రవ్యాలను ఉత్పత్తి సాగుతోందని తెలిపిన యుఎన్ నివేదిక.
ఆపన్న హస్తం, బ్రిటన్ నుంచి 3 ఆక్సిజన్ ప్లాంట్లతో ఇండియా బయల్దేరిన అంతి పెద్ద కార్గో విమానం,