AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపన్న హస్తం, బ్రిటన్ నుంచి 3 ఆక్సిజన్ ప్లాంట్లతో ఇండియా బయల్దేరిన అంతి పెద్ద కార్గో విమానం,

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం శుక్రవారం బ్రిటన్ లోని నార్తర్న్ ఐర్లాండ్ నుంచి ఇండియా బయల్దేరింది.భారత్ లో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవడానికి యూకే అతి పెద్ద కార్గో విమానాన్ని వినియోగించుకుంది....

ఆపన్న హస్తం, బ్రిటన్ నుంచి 3 ఆక్సిజన్ ప్లాంట్లతో ఇండియా బయల్దేరిన అంతి పెద్ద కార్గో విమానం,
Worlds Largest Cargo Flight Leaves For India From Uk
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 08, 2021 | 11:28 AM

Share

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం శుక్రవారం బ్రిటన్ లోని నార్తర్న్ ఐర్లాండ్ నుంచి ఇండియా బయల్దేరింది.భారత్ లో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవడానికి యూకే అతి పెద్ద కార్గో విమానాన్ని వినియోగించుకుంది. 18 టన్నుల ఆక్సిజన్ జనరేటర్లు , వెయ్యి వెంటిలేటర్లు ఈ విమానంలో ఉన్నాయి. మూడు ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లలో ఒక్కొక్కటి 40 అడుగుల ఎత్తయిన ఫ్రైట్ కంటెయినర్ల సైజులో ఉన్నాయి. ఇవి నిముషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయగలుగుతాయని, ఒకేసారి 50 మంది కోవిద్ రోగులకు ఇది సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్తర్న్ ఐర్లాండ్ నుంచి ఇండియాకు తమ వద్ద మిగిలి ఉన్న ఈ ఆక్సిజన్ సిలిండర్లను తాము పంపుతున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ తెలిపారు. కోవిద్ పై పోరులో భారత్, బ్రిటన్ దేశాలు తీవ్రంగా చేతులు కలిపి కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. మనమంతా సురక్షితంగా ఉండేంతవరకు ప్రపంచంలో ఎవరూ సురక్షితం కాదని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో బ్రిటన్ నుంచి 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఇండియాకు చేరుకున్నాయి. ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని, ఆ దేశానికి తాము అండగా ఉంటామని ఆరోగ్యశాఖ మంత్రి మట్ హాన్ కాక్ చెప్పారు. ఆ దేశానికి అవసరమైన మరింత సహాయాన్ని అందజేస్తామన్నారు. ఇండియాలో కనబడుతున్న దుస్థితి తాలూకు ఫోటోలు ఈ వైరస్ ఎంత ప్రబలంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయని నార్తర్న్ ఐర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి రాబిన్ స్వాన్ అన్నారు. ఇలా ఉండగా ఇండియాలో కోవిడ్ కేసులు 4 లక్షలకు పైగా పెరిగిపోయాయి. అమెరికా, రష్యా సింగపూర్ వంటి దేశాల నుంచి భారత్ కు సాయం అందుతోంది. అయితే ఆ సాయాన్ని వినియ్యోగించుకోవడంలో చిక్కులు ఎదురవుతున్నాయి. కస్టమ్స్ అనుమతి విషయంలో తలెత్తిన సమస్య ఈ సాయాన్ని వినియోగించుకోవడానికి అడ్డంకిగా మారుతోంది. మరిన్ని చదవండి ఇక్కడ : IPL 2021 Video: ఉన్నపళంగా క్రికెటర్లు మాల్దీవులకు ప్రయాణం కారణం ఏమై ఉంటుంది.. ? ….(వీడియో ) Viral News: కోవిడ్‌ రోగుల కోసం నర్సు పాడిన పాట.. నెట్‌లో వైరల్…. ( వీడియో )