AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా కూతుళ్లు కారు ఎప్పుడు ఎక్కినా భయమేస్తుంది’, అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా కూడా తన కూతుళ్ళ భద్రత విషయంలో ఓ సామాన్య తల్లిలా మాట్లాడింది. తమ ఇద్దరు కూతుళ్లు డ్రైవర్ లేకుండా వారికి వారు..

'నా కూతుళ్లు కారు ఎప్పుడు ఎక్కినా భయమేస్తుంది', అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా
Michelle Obama Says She Fears For Her Daughters..us
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 08, 2021 | 1:45 PM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా కూడా తన కూతుళ్ళ భద్రత విషయంలో ఓ సామాన్య తల్లిలా మాట్లాడింది. తమ ఇద్దరు కూతుళ్లు డ్రైవర్ లేకుండా వారికి వారు ఎప్పుడు కారు ఎక్కినా తమకు భయం, ఆందోళన కలుగుతాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.తమ కూతుళ్ళ గురించి ఏమీ తెలియనివారు వారి గురించి ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారోనని తాను ఎప్పుడూ వర్రీ అవుతుంటానని ఆమె చెప్పింది. బరాక్ ఒబామా దంపతులకు ఇద్దరు కూతుళ్లు..మలియా (22), సషా (19) ఉన్నారు. వారిద్దరూ మంచి స్టూడెంట్స్ అని, మర్యాదస్తులని మిషెల్ తెలిపారు. కానీ ఒక్కోసారి వారు ఉత్సాహంగా మ్యూజిక్ గట్టిగా పెట్టుకుని ఎంజాయ్ చేసినా.. వారి వెనక ఉన్నవారు ఏమనుకుంటారోనని తను కలత చెందుతుంటానని ఆమె చెప్పారు. మా ఇద్దరు కుమార్తెలూ డ్రైవర్ లైసెన్స్ పొందారంటే చాలు… ఇక మా నల్లజాతి పేరెంట్స్ గుండెలు గుభేల్ మంటుంటాయి అని ఆమె వ్యాఖ్యానించారు. తాను, తన భర్త ఒబామా వారి విషయంలో ఎందుకింత ఆందోళన చెందుతున్నామంటే…నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మర్డర్ ఉదంతమే అని ఆమె చెప్పారు. మినియాపొలీస్ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్…. ఫ్లాయిడ్ మెడపై 9 నిముషాలపాటు గట్టిగా నొక్కి పెట్టడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించాడు. లోగడ మినియాపొలీస్ లో జరిగిన ఈ ఘటన అమెరికా అంతటా తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. నల్ల జాతీయులపట్ల జాతి వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ బ్లాక్ లైవ్స్ మేటర్స్ అనే సంస్థ నాడు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. డెరెక్ కి కోర్టు 40 ఏళ్ళ జైలు శిక్ష విధించినప్పటికీ తాము ఇంకా భయంత్జోనే ఉన్నామని ఒబామా కూడా తెలిపారు. ఈ తీర్పు సరైనదే అయినా ఇంకా నల్లజాతీయులకు పూర్తి న్యాయం జరగాల్సి ఉందన్నారు. ఏ వస్తువైనా కొనేందుకు స్టోర్ కి వెళ్లినా, లేదా బయటకు ఎక్కడకు వెళ్లినా అనుక్షణం ఆందోళనగానే ఉంటామని ఆయనతో బాటు మిషెల్ కూడా తెలిపారు. బ్లాక్ లైవ్స్ మేటర్ సంస్థను ఈ ఇద్దరూ ప్రశంసించారు. మరిన్ని చదవండి ఇక్కడ : IPL 2021 Video: ఉన్నపళంగా క్రికెటర్లు మాల్దీవులకు ప్రయాణం కారణం ఏమై ఉంటుంది.. ? ….(వీడియో ) Viral News: కోవిడ్‌ రోగుల కోసం నర్సు పాడిన పాట.. నెట్‌లో వైరల్…. ( వీడియో )