AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్తాన్ లో తొలిసారిగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికై చరిత్ర సృష్టించిన హిందూ యువతి..

Pakistan Administrative Service: పాకిస్తాన్ లో మొత్తం ముస్లిం జనాభా ఉంటుంది. కొద్ది శాతం మాత్రమే హిందువులు ఉంటారు. అక్కడ హిందువులు ఇప్పటివరకూ ఉన్నత స్థాయిలో ఏ పదవుల్లోకీ చేరుకోలేదు. కానీ, ఆ చరిత్రను తిరగరాసింది ఓ యువతి.

Pakistan: పాకిస్తాన్ లో తొలిసారిగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికై చరిత్ర సృష్టించిన హిందూ యువతి..
Pakistan Administrative Service
KVD Varma
|

Updated on: May 08, 2021 | 2:57 PM

Share

Pakistan Administrative Service: పాకిస్తాన్ లో మొత్తం ముస్లిం జనాభా ఉంటుంది. కొద్ది శాతం మాత్రమే హిందువులు ఉంటారు. అక్కడ హిందువులు ఇప్పటివరకూ ఉన్నత స్థాయిలో ఏ పదవుల్లోకీ చేరుకోలేదు. కానీ, ఆ చరిత్రను తిరగరాసింది ఓ యువతి. తొలిసారిగా పాకిస్తాన్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్) లో ఎంపిక కావడమే కాకుండా.. అసిస్టెంట్ కమిషనర్ గా స్థానం సంపాదించింది. వివరాలు ఇవిగో..

పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తొలిసారిగా హిందూ అమ్మాయి అసిస్టెంట్ కమిషనర్‌గా మారింది. ఆమె పేరు సనా రామ్‌చంద్. ఈ స్థానం సాధించడానికి ఆమె సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్) లో ఉత్తీర్ణత సాధించాల్సి వచ్చింది. దీని తరువాత పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)(Pakistan Administrative Service) లో ఎంపికైంది. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద పరిపాలనా పరీక్ష. సనా వృత్తిరీత్యా ఎంబిబిఎస్ డాక్టర్ కూడా. ఈ సీఎస్‌ఎస్ రాత పరీక్షకు మొత్తం 18,553 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 221 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో సనా ఒకరు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనా మాట్లాడుతూ, ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఆశ్చర్యం లేదు. నేను చిన్నతనం నుండే విజయాన్ని కోరుకుంటాను అలాగే, దానికి అలవాటు పడ్డాను. నా పాఠశాల, కళాశాల, ఎఫ్‌సిపిఎస్ పరీక్షల్లో కూడా అగ్రస్థానంలో నిలిచాను. అని చెప్పారు.

సనా సింధ్ ప్రావిన్స్ లోని షికార్పూర్ జిల్లాలో నివసిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్ లోని చంద్కా మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ నుంచి ఎఫ్‌సిపిఎస్ చదువుతున్నారు. ఆమె త్వరలో సర్జన్ కానున్నారు. ఆమె ప్రస్తుతం సాధించిన విజయంతో పాకిస్తాన్ లోని హిందువులు సంబరాలు చేసుకున్నారు.

పాకిస్తాన్లో హిందూ జనాభా లెక్కలు ఏమిటి?

ఈ సందర్భంగా పాకిస్తాన్ లో హిందువులు ఎంతమంది ఉన్నారు? వారి లెక్కలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. పాకిస్తాన్ లో హిందువుల లెక్కలకు సంబంధించి వేర్వేరు గణాంకాలు ఉన్నాయి. చివరి జనాభా గణన 1998 లో పాకిస్తాన్‌లో జరిగింది. 2017 లో కూడా జన గణన జరిగింది కానీ. మతం ప్రకారం జనాభా డేటా ఇంకా విడుదల కాలేదు.

పాకిస్తాన్ స్టాటిక్స్ బ్యూరో నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 1998 లో మొత్తం జనాభా 13.23 మిలియన్లు. అందులో హిందూ జనాభా 1.6% అంటే 21.11 లక్షలు. 1998 లో, పాకిస్తాన్ జనాభాలో 96.3% ముస్లింలు మరియు జనాభాలో 3.7% ముస్లిమేతరులు. కాగా, పాకిస్తాన్ జనాభా 2017 లో 20.77 కోట్లకు పైగా పెరిగింది. కాగా, మార్చి 2017 లో లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో, 1998 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్‌లో హిందూ జనాభా 1.6%, అంటే సుమారు 30 లక్షలు అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

పాకిస్తాన్ వాదనలు – అక్కడ 4% హిందువులు , పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ 8 మిలియన్లకు పైగా హిందూ జనాభా ఉందని, ఇది పాకిస్తాన్ మొత్తం జనాభాలో 4% అని చెప్పారు. దీని ప్రకారం, పాకిస్తాన్లోని సింధ్ ఫ్రావిన్స్ లో గరిష్టంగా 94% హిందూ జనాభా నివసిస్తున్నారు.

Also Read: ‘నా కూతుళ్లు కారు ఎప్పుడు ఎక్కినా భయమేస్తుంది’, అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా

ఆపన్న హస్తం, బ్రిటన్ నుంచి 3 ఆక్సిజన్ ప్లాంట్లతో ఇండియా బయల్దేరిన అంతి పెద్ద కార్గో విమానం,