AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించే తేనెటీగలు, నెదర్లాండ్స్ లో శిక్షణ నిస్తున్న రీసెర్చర్లు,

కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను ఇక తేనెటీగలు కూడా గుర్తిస్తాయట..ఇందుకు అనువుగా నెదర్లాండ్స్ లోని పరిశోధకులు వీటికి శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసనను పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే ఇందుకు దోహదపడుతోందని వీరు అంటున్నారు.

కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించే తేనెటీగలు, నెదర్లాండ్స్ లో శిక్షణ నిస్తున్న రీసెర్చర్లు,
Bees Are Trained In Netherlands For Covid 19 Test Results
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 08, 2021 | 3:27 PM

Share

కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను ఇక తేనెటీగలు కూడా గుర్తిస్తాయట..ఇందుకు అనువుగా నెదర్లాండ్స్ లోని పరిశోధకులు వీటికి శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసనను పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే ఇందుకు దోహదపడుతోందని వీరు అంటున్నారు. కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించుకోవాలంటే తేనెటీగలే శరణ్యమంటున్నారు. నెదర్లాండ్స్ యూనివర్సిటీలో గల బయో వెటర్నరీ ల్యాబ్ లో వీరు ఇలా వీటికి శిక్షణ ఇస్తున్నారు. మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిల్స్ ని వీటికి చూపుతామని, స్ట్రా వంటి తమ నాలుకలతో ఇవి వాటి వాసన పీల్చుతాయని రీసీర్చర్లు తెలిపారు. ఆ తరువాత ‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు.ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు ఇవి తమ నాలుకలను చాచవని తేలిందన్నారు. కానీ షుగర్ వాటర్ ఇస్తే మాత్రం అందుకుంటాయని పరిశోధకులు చెప్పారు. తేనెటీగలను సేకరించేవారి నుంచి తాము వీటిని తీసుకువచ్చి ప్రత్యేక హార్నెసెస్ వంటి వాటిలో ఉంచుతామన్నారు. ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. కానీ దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదని బెల్జియంలోని గ్రాఫ్ అనే పరిశోధకుడు తెలిపారు. ఈయన కూడా తేనెటీగలు, కీటకాలపై తెగ రీసెర్చ్ చేస్తుంటాడు. సమీప భవిష్యత్తులో ఇలాంటివి పనికిరావని, తాను కూడా తేనెటీగలపై పరిశోధనలు చేసినా ఇతర పనులకోసం వాటిని వినియోగించుకుంటానని ఆయన చెప్పాడు. క్లాసిక్ డయాగ్నస్టిక్ పరికరాలనే కోవిద్ టెస్టులకు వినియోగించుకోవడం బెస్ట్ అని ఆ ఈయన ఆభిప్రాయపడ్డాడు.1990 ప్రాంతాల్లో అమెరికాలోని రక్షణ విభాగం పేలుడు పదార్థాలను, టాగ్జిన్లను గుర్తించడానికి కీటకాలను వినియోగించుకుందని ఆయన చెప్పాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: SS Rajamouli: జక్క‌న్నకు సాటిలేరు ఎవ‌రూ.. ! ఆకాశానికెత్తేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకంటే

Barat Video: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పొదలు, పంట పొలాల్లో పెళ్లి బరాత్.. చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు