Old Woman in Well: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు గంటలు బావిలో గడిపిన 80 ఏళ్ల బామ్మ.. పోలీసుల రాకతో క్షేమం!

తిరుపతి సమీపంలో ఓ వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది. బావిలో పడి 5 గంటలకు పైగా విలవిల లాడింది. నన్ను కాపాడండిరో దేవుడా అంటూ కేకలు పెట్టింది.

Old Woman in Well: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు గంటలు బావిలో గడిపిన 80 ఏళ్ల బామ్మ.. పోలీసుల రాకతో క్షేమం!
Police Helps Old Woman Fell In The Well
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2021 | 4:27 PM

Old Woman Safe: తిరుపతి సమీపంలో ఓ వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది. బావిలో పడి 5 గంటలకు పైగా విలవిల లాడింది. నన్ను కాపాడండిరో దేవుడా అంటూ కేకలు పెట్టింది. బావిలో ఉన్న బోరు పైపే ఆమెకు ఆధారమైంది. ఆ పెద్దావిడ కేకలు విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఆ బామ్మ ప్రాణాలు దక్కాయి.

చిత్తూరు జిల్లా రేణిగుంటలో 80 ఏళ్ల వయసున్న సుబ్బమ్మ.. వ్యవసాయ పనులకు వెళ్తూ పొరపాటున జారి వ్యవసాయ బావిలో పడింది. ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. బావిలో ఉన్న పైప్‌లైన్ పట్టు దొరకడంతో దానిని పట్టుకుని అలాగే ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో.. ఆమె కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు.

సుమారు ఐదు గంటల పాటు నీటిలోనే పైపుని పట్టుకొని.. కేకలు వేస్తూనే ఉంది. కాగా, చాలాసేపటికి అటుగా వెళుతున్న వారు ఆమె కేకలను గమనించి గాజులమండ్యం పోలీస్ స్టేషన్ యస్.ఐ శ్రీనివాసులుకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది శివ కుమార్, మహేష్.. ఆ బామ్మను బయటకు తీశారు. మంచానికి తాళ్లు కట్టి ఆమెను బయటకు లాగారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డ బామ్మకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తన ప్రాణాలను కాపాడిన పోలీసులకు సుబ్బమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

Read Also… Covid Vaccine: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సిన్ కష్టాలు… టీకా కేంద్రాల వద్ద బారులు.. రెండో డోసు కోసం ఎదురుచూపులు!