AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సిన్ కష్టాలు… టీకా కేంద్రాల వద్ద బారులు.. రెండో డోసు కోసం ఎదురుచూపులు!

కరోనా కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ టీకా కొరత వేధిస్తోంది. ఈ రెండూ జనాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ఓ విడత వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు రెండో డోస్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

Covid Vaccine: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సిన్ కష్టాలు... టీకా కేంద్రాల వద్ద బారులు.. రెండో డోసు కోసం ఎదురుచూపులు!
People Awaiting Second Dose
Balaraju Goud
|

Updated on: May 08, 2021 | 4:00 PM

Share

Covid 19 Vaccination in AP:  దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. మరోవైపు కరోనా కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ టీకా కొరత వేధిస్తోంది. ఈ రెండూ జనాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ఓ విడత వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు రెండో డోస్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు మా వంతు ఎప్పుడు వస్తుందా అంటూ హైరానా పడుతున్నారు. వ్యాక్సిన్‌ మాట వింటే చాలు వీళ్లంతా అలర్ట్ అవుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

ఏపీలో టీకా కేంద్రాల దగ్గర గందరగోళం నెలకొంది. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కోసం జనం ఎదురు చూస్తున్నారు. మొదటి డోస్ తీసుకున్న వారికి నిర్ణీత సమయంలో రెండో డోస్ అందకపోవడంతో.. వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కోవాగ్జిన్‌ కొరత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి టీకా ఇచ్చే రెండో డోస్ ఇవ్వకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలులో కరోనా వ్యాక్సిన్ రెండోడోసు కోసం జనం నరకయాతన అనుభవిస్తున్నారు. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద తోపులాట జరుగుతోంది. మంగమూరుడొంక పిహెచ్‌సి సెంటర్లో ఇద్దరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. ఉదయం 6 గంటలకే వేలమంది వ్యాక్సిన్ కోసం వచ్చారు. వాళ్లను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట జరిగింది.

ఒంగోలులో ఎంపిక చేసిన 6 కేంద్రాల్లో కొవాగ్జిన్‌ రెండోడోస్‌ వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు 1300 డోసులు కేటాయించారు. మంగమూరు రోడ్డు, వెంకటేశ్వరకాలనీ, పాపాకాలనీ, బాలాజీనగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జీజీహెచ్‌లోని రెండు కేంద్రాల్లో ఈ టీకా వేశారు. కొవాగ్జిన్‌ రెండో డోస్‌ కోసం ప్రకాశంజిల్లాలో 23 వేల మంది వెయిట్ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ రాక వ్యాక్సిన్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వచ్చిన వ్యాక్సిన్‌ ప్రతి వంద మందిలో కేవలం 25 మందికే సరిపోతుంది. మిగిలిన వారు క్యూలో నిలబడి చివరకు వ్యాక్సిన్‌ అందక నిరాశతో వెళ్తున్నారు. అందుకే తోపులాట జరుగుతోంది.

అటు, విశాఖ జిల్లాలోనూ వాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. 60 డోస్‌ల వాక్సిన్ వచ్చిన ఒక కేంద్రానికి 600 మంది జనం రావడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. మొదట వచ్చిన 60 మందికే వాక్సిన్ టోకెన్లు ఇచ్చి మిగతావారిని పోలీస్ ల సహాయంతో పంపించేశారు. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కంచికచర్ల పిహెచ్సిలో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. జనం భారీగా రావడంతో తోపులాట కూడా జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు సీన్‌లోకి ఎంటర్‌ అవ్వాల్సిన వచ్చింది.

చిత్తూరు జిల్లాలో వందకుపైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరిగింది. 3.50 లక్షల మందికి సెకండ్ డోస్ వేయాల్సి ఉండగా కేవలం 26 వేల డోసులు మాత్రమే రావడంతో ఆందోళన నెలకొంది. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. మదనపల్లి రామారావు కాలనీలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. కర్నూలులోటీకా కోసం వేలమంది ఎదురుచూస్తూ ఉన్నారు. టీకా ఈరోజు ఉదయం నుంచి ఎక్కడ ఎక్కడ ఇస్తారన్న ప్రచారంతో కర్నూలు కంటి ఆస్పత్రికి తెల్లవారు జాము ఏదు గంటల నుంచే బారులు తీరారు జనం. దాదాపు రెండు వేల మంది వరకు వచ్చారు. తీర ఐదువందల డోసులు కూడా రాకపోవడంతో టీకా వేయడం అయిపోగానే అంతా నిరాశతో వెనుదిరిగారు.

Read Also….  Corona Risk: సాధారణ మహిళల కంటే గర్భిణీ స్త్రీలకు కరోనా వచ్చే అవకాశం ఉందా? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?