Rain Alert: చల్లని కబురు.. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?

Rain Alert in Andhra Pradesh: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత బాగా పెరిగింది. నిత్యం రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత నమోదవుతోంది. పలు రాష్ట్రాల్లో

Rain Alert: చల్లని కబురు.. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?
Rain Alert
Follow us

|

Updated on: May 08, 2021 | 5:28 PM

Rain Alert in Andhra Pradesh: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత బాగా పెరిగింది. నిత్యం రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత నమోదవుతోంది. పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగిస్తోంది. కాగా.. కొన్ని రోజులుగా ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల పంటలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం శనివారం ప్రకటనను విడుదల చేసింది. శనివారం, ఆదివారం, సోమవారానికి సంబంధించిన వాతవరణ రిపోర్టును వెల్లడించింది. రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈ రోజు ఉరుములు , మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఉరుములు , మెరుపులతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు, రేపు , ఎల్లుండి ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read:

Old Woman in Well: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు గంటలు బావిలో గడిపిన 80 ఏళ్ల బామ్మ.. పోలీసుల రాకతో క్షేమం!

Andhra Corona : తూర్పు గోదావ‌రి జిల్లాలో.. ఆ ఊరంతా పాజిటివ్‌లే..రోజూ మరణాలే!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..