AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Test: డీఆర్​డీఓ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌… సెకన్లలోనే కరోనా టెస్ట్​… కచ్చితత్వం 96.73 శాతం

అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)....

Corona Test:  డీఆర్​డీఓ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌... సెకన్లలోనే కరోనా టెస్ట్​... కచ్చితత్వం 96.73 శాతం
Coronavirus
Ram Naramaneni
|

Updated on: May 08, 2021 | 2:07 PM

Share

అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) కోవిడ్ -19 ను గుర్తించడంలో సహాయపడటానికి ఒక కృత్రిమ మేధస్సు (AI) అల్గోరిథంను సృష్టించాయి. ఈ అల్గోరిథం ప్ర‌కారం చెస్ట్ ఎక్స్ రే తీయ‌డం ద్వారా ఈజీగా కోవిడ్ ను గుర్తించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. డెవలపర్ల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, ఛాతీ ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ఉపయోగించిన ఆత్మన్ ఏఐ అనే సాధనం వైర‌స్ ను గుర్తిచ‌డంలో 96.73 శాతం ఖచ్చితత్వ రేటును చూపించింది. క‌రోనా రోగులను వేగంగా గుర్తించడానికి, సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడటానికి…. ఫ్రంట్‌లైన్‌లోని వైద్యులకు సహాయం చేయడానికి డీఆర్డీఓ.. ఈ డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేసింద‌ని ఆ సంస్థ‌ డైరెక్టర్ డాక్టర్ యూకే సింగ్ చెప్పారు.

ఎక్స్-రే ఉపయోగించి వైర‌స్ ను డిటెక్ట్ చేయ‌డం చాలా వేగ‌వంతమైన పని అని, తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని ఈ ప‌రిశోధ‌న చేసిన టీమ్ పేర్కొంది. సిటి స్కాన్లు అందుబాటులో లేని మన దేశంలోని చిన్న పట్టణాల్లో చాలా ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంద‌ని, ఇది రేడియాలజిస్టులపై భారాన్ని త‌గ్గిస్తుంద‌ని వారు చెబుతున్నారు. చెస్ట్ ఎక్స్-రే లోని ఏఐ సాధ‌నం ఉప‌యోగించి రోగిలో వ్యాధి వ్యాప్తి ఏ ద‌శ‌లో ఉందో గుర్తించ‌వ‌చ్చ‌ని.. దీని ద్వారా చికిత్స కూడా సుల‌భ‌త‌రం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

కాగా దేశంలోని రేడియాలజిస్టుల డిజిటల్ నెట్‌వర్క్.. 5 సి నెట్‌వర్క్, హెచ్‌సిజి అకాడెమిక్స్ సహకారంతో దేశంలోని దాదాపు 1000 ఆసుపత్రులలో ఈ సాధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ సాంకేతిక ద్వారా కరోనాను కొన్ని సెకన్లలో కనుగోవచ్చని హెచ్​సీజీ అకాడమిక్స్​ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ టూల్​ ద్వారా ప్రస్తుతం ఆస్పత్రులలో సీటీ స్కాన్​ మెషీన్లపై పడుతున్న భారం కొంత తగ్గుతుందని హెచ్​సీజీ అకాడమిక్స్​ అభిప్రాయపడింది.

Also Read: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి దృష్టి లోపం, సూరత్ లో తలెత్తిన కొత్త ప్రమాదం, అధ్యయనం చేస్తున్న నిపుణులు

కడప జిల్లాల్లో ఘోర ప్రమాదం.. ముగ్గురాయి గనిలో జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుడు.. 9 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Follow Us
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..