పశ్చిమ మెడినిపూర్ జిల్లాలోని డెబ్రా అసెంబ్లీ సీటులో ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఈసారి ప్రత్యేక్ష పోరులో ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి హుమయూన్ కబీర్‌ను టీఎంసీ తన అభ్యర్థిగా ప్రకటించగా.. బీజేపీ.. మాజీ పోలీసు అధికారి భారతి ఘోష్‌కు టికెట్ ఇచ్చింది. బెంగాల్ మాజీ పోలీసు అధికారి భారతి ఘోష్ ఒకప్పుడు మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ.. కొంతకాలం తరువాత ఆమెపై పలు ఆరోపణలు చేసి.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో పార్టీ డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గం బరిలోకి దింపింది. ఘటాల్ లోక్‌సభలో పరిధిలోకి డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. ఇక్కడ నుంచి బెంగాలీ చిత్రాల సూపర్ స్టార్ దేవ్ టీఎంసీ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ భారతీయ ఘోష్‌ను నిలబెట్టగా.. టీఎంసీ చేతిలో ఓడిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్రాలో టీఎంసీ నుంచి సలీమా ఖాతున్ విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి జహంగీర్ కరీంను ఆమె 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది.