चुनाव क्षेत्र चुनें

అరూప్ బిస్వాస్-టాలీగంజ్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

టీఎంసీ | టాలీగంజ్‌

మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన అరుప్ విశ్వాస్ ఈసారి గడ్డుపరిస్థిని ఎదుర్కొంటున్నారు. లాలిగంజ్‌లో ఆయన్ను బిజెపి ఎంపి, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సవాలు చేస్తున్నారు. అరుప్ విశ్వాస్‌ 2006 నుంచి ఈ సీటును గెలుపొందుతూ వస్తున్నారు. మమతా బెనర్జీ మొదటి ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా పనిచేసిన విశ్వాస్ ప్రస్తుతం పిడబ్ల్యుడి మంత్రిగా ఉన్నారు. దీనితో పాటు ఆయనకు ఉత్తర బెంగాల్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యత కూడా ఉంది. 56 ఏళ్ల విశ్వాస్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించారు. మమతా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించినప్పుడు ఆయన పార్టీని వీడారు. 2006 ఎన్నికలలో మమతా బెనర్జీ మొదటిసారి టాలీగంజ్ టికెట్‌ను కేటాయించారు. అప్పటినుంచి గెలుస్తూ వస్తున్నారు. 2016 ఎన్నికల్లో అరుప్ విశ్వాస్ సీపీఎం అభ్యర్థి మధుజా సేన్ ఝ ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అప్పట్లో బిజెపి అభ్యర్థి ఎన్ మోహన్ రావుకు సుమారు 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

Ads By Adgebra