డోమ్జూర్ అసెంబ్లీ నియోజకవర్గం హౌరా జిల్లాలో పరిధిలో వస్తుంది. ఈ స్థానంలో బీజేపీ రాజీవ్ బెనర్జీని తన అభ్యర్థిగా బరిలో దించింది. రాజీవ్ బెనర్జీ మమతా బెనర్జీ ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. టీఎంసీ కల్యాణేండు ఘోష్ ను ఇక్కడ బరిలో దించింది. తృణమూల్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ ఇక్కడి నుంచి ఎంపీ. 2016లో టీఎంసీ అభ్యర్థి రాజీవ్ బెనర్జీకి 1 లక్ష 48 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జయంత్ దాస్ 15 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 1952 నుంచి ఈ సీటుకు జరుగుతున్న ఎన్నికల్లో సీపీఐ మూడుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు, సీపీఎం 9 సార్లు, టీఎంసీ రెండుసార్లు గెలిచాయి. ఈసారి టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.