Dangerous apps: ఫోన్‌లోని యాప్‌లతో ఇంత ప్రమాదమా..? ఆ యాప్స్ ఏంటో తెలిస్తే షాకవుతారు
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ అత్యంత అవసరమైన వస్తువుగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకూ అడుగడుగునా అనేక విధాలుగా సహాయ పడుతుంది. ఎన్నో పనులను చాలా సులువుగా జరుపుకోవడానికి వీలు కల్పిస్తోంది. దీన్ని ఉపయోగించి ఏ పనినైనా చిటికెలో చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ప్రయోజనాలను రాయాలంటే ఆ జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది.
అనేక ప్రయోజనాలు ఉన్న స్మార్ట్ ఫోన్ తో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మన వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ సమస్య తప్పదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్‌ను మనం మెలకువగా ఉన్నంత సేపూ వినియోగిస్తుస్తాం. ఏ అర్ధరాత్రి సమయానికి నిద్ర పోతాం. ఆ సమయంలో ఫోన్‌కు రెస్ట్ ఇచ్చామని భావిస్తాం. అయితే మీ ఫోన్ అస్సలు నిద్రపోకుండా ఉంటే అవకాశం ఉంది. మీకు తెలియకుండా రహస్యంగా పనిచేస్తూ ఉండవచ్చు. మీ అనుమతి లేకుండా సమాచారం, వ్యక్తిగత వివరాలను వేరొకరి పంపే పని చేస్తూ ఉండవచ్చు.
సాధారణంగా స్మార్ట్ ఫోన్ లో అనేక యాప్‌లు ఉంటాయి. వాటిని ఉపయోగించి వివిధ పనులు చేసుకుంటూ ఉంటాం. ఆర్థిక లావాదేవీలు, టిక్కెట్ల బుక్కింగ్, వినోదం, సంగీతం.. ఇలా అనేక రకాల యాప్ లను వినియోగిస్తాం. అయితే చాలా యాప్ లు ఫోన్ బ్యాక్ గ్రైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. మీరు పడుకున్నా సరే అవి పనిచేస్తూనే ఉంటాయి. మీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తాయి. మీ లొకేషన్ ట్రాకింగ్, మెసేజ్‌ల రీడింగ్, కాల్ లాగ్ యాక్సెస్ చేస్తూ ఉంటాయి. ఫోన్‌లో వివిధ యాప్ లను ఇన్ స్టాల్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు అడుగుతారు. వాటిని మనం గుడ్డిగా ఓకే చేస్తాం. వాటిలో కెమెరా ఉపయోగించడానికి, మైక్రో ఫోన్ ఉపయోగించడానికి, కాంటాక్ట్స్ యాక్సెస్ చేయడానికి అనుమతులు కోరతారు.
ఆ యాప్ ను తొందరగా ఇన్ స్టాల్ చేయాలనే కంగారులో అన్నింటికీ ఓకే చెప్పుకుంటూ వెళ్లిపోతాం. అదే అందరూ చేసే ముఖ్యమైన తప్పు. ఇలా అనుమతులు ఇవ్వడం వల్లనే మన డేటా అంతా తస్కరణకు గురవుతుంది. కొన్ని యాప్ లు మన అనుమతులను దుర్వినియోగం చేస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా యాప్‌కు అనుమతి ఇచ్చేముందు జాగ్రత్తగా చదవాలి. మీరు ఉపయోగించని యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ను ఎప్పటికప్పుడు స్కాన్ చేయాలి. సాప్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. పడుకున్నప్పుడు బ్యాక్ గ్రైండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను మూసివేయాలి. అలాగే బ్యాంక్ గ్రైండ్ డేటాను కూడా ఆఫ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి