Toxic Movie: నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. ‘టాక్సిక్’ కోసం యశ్ కీలక నిర్ణయం

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బెంగుళూరులో షూటింగ్ ముగించుకున్నటీమ్ ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. కాగా హాలీవుడ్ లెవెల్ లో గ్రాండ్ గా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Toxic Movie: నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్..  'టాక్సిక్' కోసం యశ్ కీలక నిర్ణయం
Toxic Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2025 | 9:28 PM

మరికొద్ది రోజుల్లో నటుడు యష్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈసారి కూడా తన బర్త్‌డే మరింత స్పెషల్ గా ఉండనుంది. ఎందుకంటే యశ్ తన సినిమా ‘టాక్సిక్’ని ఇతర సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో ప్రెజెంట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఓ పెద్ద హాలీవుడ్ కంపెనీతో చర్చలు ప్రారంభించాడు యశ్. 1915 నుండి చలనచిత్ర నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ప్రపంచంలోని పురాతన, అత్యుత్తమ స్టూడియోలలో ఒకటైన 20వ సెంచరీ ఫాక్స్‌తో యశ్ చర్చలు జరుపుతున్నాడు. అయితే యష్ కొత్త సినిమా కోసం ఈ చర్చలు జరపలేదు. తన ‘టాక్సిక్’ చిత్రం కోసమే 20వ సెంచరీ ఫాక్స్ స్టూడియోతో చర్చలు జరిపాడు. ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తమ సినిమాను భారీగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగా వారు నిర్మాణ సంస్థ అయిన 20th సెంచురీ ఫాక్స్‌తో మాట్లాడుతున్నారు.

టాక్సిక్‌ను గ్లోబల్ ప్రాజెక్ట్‌గా మార్చాలన్నది యశ్ ఉద్దేశ్యం. టాక్సిక్ కథ, విజువల్స్ అంతర్జాతీయంగా తీర్చిదిద్దాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘టాక్సిక్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మంచి భాగస్వామి కోసం చూస్తున్నామని ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన ఓ వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. టాక్సిక్’ సినిమా డిసెంబర్ 2025లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చాలా భాగం షూటింగ్ బెంగుళూరులో కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. యశ్‌తో పాటు కియారా అద్వానీ, నయనతారతో పాటు పలువురు స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోయర్లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.