Sonali Bendre: క్యాన్సర్‏తో పోరాటం.. బతికే అవకాశం 30 శాతమే ఉందన్నారు.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అదే సమయంలో అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే క్యాన్సర్ భారిన పడింది. ఎన్నో సంవత్సరాల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.

Sonali Bendre: క్యాన్సర్‏తో పోరాటం.. బతికే అవకాశం 30 శాతమే ఉందన్నారు.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్..
Sonali Bendre
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2025 | 9:19 PM

ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అందం, అభినయంతో కట్టిపడేసింది సోనాలి బింద్రే. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీని ఏలేసింది. ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఉన్నారు. సోనాలి బింద్రే.. ఇటీవలే తన 50వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు తన జీవితంలో అత్యంత చెత్త సమయాన్ని ఎదుర్కొంది. తాజాగా క్యాన్సర్ తో పోరాటం.. మానసిక సంఘర్షణ, క్లిష్ట పరిస్థితుల గురించి మాట్లాడింది. కొన్నేళ్ల క్రితం సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ రోజులు ఆమెకు, ఆమె కుటుంబానికి చాలా కష్టంగా ఉండేవి. ఈ విషయాన్ని ఆమె తన అభిమానులతో పంచుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

ఒక ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ “ఇది జరిగినప్పుడు, నేను రియాలిటీ షో చేస్తున్నాను. ప్రతి వారం షూటింగ్‌ చేసేవాళ్లం. నాలో ఏదో తప్పు అనిపించింది. నేను డాక్టర్ దగ్గరకు వెళ్లగా నాకు క్యాన్సర్ అని తెలిసింది. మొదట ఇది మొదటి దశ అని నేను అనుకున్నాను, కాని పరీక్షలు చేసిన తర్వాత అది నా శరీరమంతా వ్యాపించిందని తెలిసింది. దీంతో నా భర్త, డాక్టర్ అందరూ షాకయ్యారు. అప్పట్లో నేను బతికే అవకాశం కేవలం 30 శాతం మాత్రమే ఉందని అన్నారు. 2018లో క్యాన్సర్ తో పోరాటం చేశాను ” అంటూ చెప్పుకొచ్చింది సోనాలి.

కానీ సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం వలన సోనాలి బింద్రే ఈ వ్యాధి నుంచి బయటపడింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.