AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మార్కెట్‌లో ఈ 5 రూపాయల కాయిన్స్ తగ్గడానికి కారణం ఏంటో తెలుసా.?

ప్రస్తుతం మార్కెట్లో 5 రూపాయాల కాయిన్స్‌లో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు లావుగా, మందంగా ఉన్న కాయిన్స్‌ పెద్దగా కనిపించడం లేదు. తక్కువ మందంతో, బరువు తక్కువ ఉన్న కాయిన్స్‌ చెలామణి పెరిగింది. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా..?

RBI: మార్కెట్‌లో ఈ 5 రూపాయల కాయిన్స్ తగ్గడానికి కారణం ఏంటో తెలుసా.?
RBI
Narender Vaitla
|

Updated on: Nov 12, 2024 | 11:25 AM

Share

గమనిస్తే మార్కెట్లో పాత రూ. 5 కాయిన్స్‌ చలమాణీ తగ్గుతున్న విషయం స్పష్టమవుతోంది. వీటి స్థానంలో సన్నగా రాగి కలర్‌లో ఉన్న కాయిన్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. అయితే మార్కెట్లో ఇలా ఈ కాయిన్స్‌ తగ్గడం వెనకాల అసలు కారణం ఏంటో తెలుసా.? దీనివెనకాల పెద్ద కథే ఉందండోయ్‌. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాత రూ. 5 కాయిన్స్‌ కొద్దిగా లావుగా ఉండేవి. వీటి బరువు కూడా ఎక్కువగా ఉండేవి. ఈ కాయిన్స్‌ను ఖరీదైన కప్రో-నికెల్‌ అనే లోహంతో తయారు చేసేవారు. వీటి బరువు సుమారు 9 గ్రాములు ఉంటుంది. అయితే వీటిని కొందరు అక్రమంగా బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. తరలించిన ఈ కాయిన్స్‌ను కరిగించి బ్లేడ్స్‌ తయారు చేస్తున్నారు. దీంతో డబ్బులు సంపాదిస్తున్నారు.

ఒక్క రూ. 5 కాయిన్‌ను కరిగించడం ద్వారా ఆరు బ్లేడ్స్‌ను తయారు చేయొచ్చు. ఒక్కో బ్లేడ్‌ రూ. 2 విక్రయించినా ఒక్క కాయిన్‌తో రూ. 12 సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారం ఏదో లాభదాయకంగా ఉండడంతో పెద్ద ఎత్తున భారత్‌ను నుంచి అక్రమంగా కాయిన్స్‌ను తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పాత నాణేల తయారీని ఆపేసి కొత్త కాయిన్స్‌ను తయారు చేయడం ప్రారంభించింది.

ఈ కొత్త కాయిన్స్‌ మందంతో పాటు బరువును సైతం తగ్గించింది. అదే విధంగా తక్కువ ధర ఉన్న లోహంతో తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ కారణంగానే మార్కెట్లోకి కొత్త రూ. 5 కాయిన్స్‌ వస్తున్నాయి. దీంతో నాణేల అక్రమ రవణా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. చూశారుగా మార్కెట్లో కాయిన్స్‌ వెనకాల ఉన్న అసలు కథ ఇది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!