AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇల్లు యాంటిలియాను మించిన భారీ, లగ్జరీ భవనం..! ఎవరిది, ఎక్కడ ఉందో తెలుసా..?

గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అక్కడి ప్రజలు ఆహారం కోసం పడరానిపాట్లు పడుతున్నారు. కానీ, పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలు ఒకేలా లేవు. ఇక్కడ కూడా వారి రాజరిక జీవనశైలికి ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.

అంబానీ ఇల్లు యాంటిలియాను మించిన భారీ, లగ్జరీ భవనం..! ఎవరిది, ఎక్కడ ఉందో తెలుసా..?
Antilia Vs Pakistan Most Expensive House
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2024 | 1:18 PM

Share

భారతదేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీకి చెందినది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని యాంటిలియా ఆకాశహర్మ్యం దేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. ఈ 27 అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఈ ఇంటి నిర్మాణం 2010 సంవత్సరంలో పూర్తయింది. ఈ ఇంటి పేరు యాంటిలియా. దీని ధర దాదాపు రూ.15,000 కోట్లు. భవనం ఎత్తు 173 మీటర్లు (568 అడుగులు), 6,070 చదరపు మీటర్ల (65,340 చదరపు అడుగులు)వైశాల్యంలో విస్తరించి ఉంది. అయితే, ఇంత ఖరీదైన భవనాన్ని మించిన మరో భారీ నివాసం కూడా ఉంది. ఈ ఇంటి ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మి, ఒళ్లంతా గింగిరాలు తిరగాల్సిందే..! అలాంటి ఇల్లు ఎవరిది..? ఎక్కడ ఉంది..? పూర్తి వివరాల్లోకి వెళితే…

గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అక్కడి ప్రజలు ఆహారం కోసం పడరానిపాట్లు పడుతున్నారు. కానీ, పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలు ఒకేలా లేవు. ఇక్కడ కూడా వారి రాజరిక జీవనశైలికి ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. గుల్బర్గ్ పాకిస్తాన్‌లోని అటువంటి ప్రాంతం..! గుల్బర్గా విలాసవంతమైన విల్లాలు, భవనాలకు ప్రసిద్ధి చెందింది. దేశంలోని రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు ఎక్కువ మంది ఇక్కడే నివసిస్తుంటారు. పాకిస్థాన్‌లోని అత్యంత ఖరీదైన ఇల్లు కూడా ఇక్కడే ఉంది.

గుల్బర్గ్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోని అత్యంత అద్భుతమైన ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతమంతా గొప్పగొప్ప భారీ భవనాలు, ఖరీదైన గృహాల సముదాయాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇక్కడ మరో భారీ, ఖరీదైన ఇల్లు నిర్మించబడింది. ఇది పాకిస్తాన్‌లోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌లో అత్యంత ఖరీదైన ఇల్లు..

పాకిస్థాన్‌లోని అత్యంత ఖరీదైన ఇంటి పేరు రాయల్ ప్యాలెస్. ఇది గుల్బర్గ్ సమీపంలో నిర్మించిన భారీ భవనం. ఇందులో స్విమ్మింగ్ పూల్, గ్యారేజ్, థియేటర్, జిమ్ వంటి గొప్ప సౌకర్యాలను కలిగి ఉంది. ఇందులో 10 భారీ బెడ్‌రూమ్‌లు, 9 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. చూస్తే ఇది ఖచ్చితంగా ఇల్లు కాదు ప్యాలెస్ అని చెబుతారు. చూసేందుకు ఈ ఇల్లు విలాసవంతమైన హోటల్‌లా కనిపిస్తుంది. ఈ ఇంటి బయట ఓపెన్‌ ప్లెస్‌ కూడా చాలా ఉంది. ఇక్కడ చెట్లు, మొక్కలు గార్డెన్‌ ఏరియా కూడా చాలా పెద్దది. అమెరికా నుంచి తెచ్చిన ఎత్తైన చెట్లు, అలంకార లైట్ పోల్స్ మొరాకో నుండి దిగుమతి చేసుకున్నారు. ప్రవేశద్వారం వద్ద థాయిలాండ్-ప్రేరేపిత నీటి ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. ఇంత విలాసవంతమైన ఇంటి ధర మాత్రం PKR 125 కోట్లుగా సమాచారం. (దీని ధర దాదాపు 39 కోట్ల రూపాయలకు సమానం.)

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సుమారు 2 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. ఇది దేశంలో తొమ్మిదవ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది. ఈ నగరం 1960లలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. నేడు ఈ నగరం నివసించడానికి పాకిస్తాన్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి. అందుకే ఈ ప్రాంతం ధనవంతులదేనని చెబుతుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..