Garuda Shakti 2024: ఆకట్టుకున్న భారత్ – ఇండోనేషియా గరుడ శక్తి విన్యాసాలు..
భారత్ నుంచి 25 మంది సిబ్బందితో కూడిన బృందం జకార్తాలోని సిజాంటుంగ్‌కు వెళ్లింది. భారత ఆర్మీ తరఫున పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్సెస్) నుంచి సైనికులు ప్రాతినిధ్యం వహించగా.. ఇండోనేషియా నుంచి 40 మంది సైనిక సిబ్బందితో కూడిన ప్రత్యేక దళం కొపాసస్ ప్రాతినిధ్యం వహించింది.
‘గరుడ శక్తి’ పేరిట భారత్, ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడిగా విన్యాసాలు ప్రదర్శించాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమైన ఈ ప్రత్యేక దళాల విన్యాసాలు నవంబర్ 12 వరకు కొనసాగుతాయి. భారత్ నుంచి 25 మంది సిబ్బందితో కూడిన బృందం జకార్తాలోని సిజాంటుంగ్‌కు వెళ్లింది. భారత ఆర్మీ తరఫున పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్సెస్) నుంచి సైనికులు ప్రాతినిధ్యం వహించగా.. ఇండోనేషియా నుంచి 40 మంది సైనిక సిబ్బందితో కూడిన ప్రత్యేక దళం కొపాసస్ ప్రాతినిధ్యం వహించింది.
గరుడ శక్తి 24 (GARUD SHAKTI 24)లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాలు ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక దళాల మధ్య పరస్పర అవగాహన, ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి.
గరుడ శక్తి ఇండోనేషియా, భారతదేశం మధ్య నిర్వహించిన అతిపెద్ద సైనిక విన్యాసం. ఇది రెండు దేశాల మధ్య ప్రత్యామ్నాయంగా ఏటా జరుగుతుంది. తొలుత గరుడ శక్తి వ్యాయామం 2012లో ఇండోనేషియాలో జరిగింది. భారతదేశం, ఇండోనేషియా దీర్ఘకాల, బలమైన రక్షణ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. రెండు దేశాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంలో పరస్పర ఆసక్తిని పంచుకుంటాయి. వివిధ రంగాలలో తమ రక్షణ సహకారాన్ని మెరుగుపరచుకోవడానికి సహకరించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..