గొడవ జరుతుందని వెళ్తే, లేడీ కానిస్టేబుల్‌ బట్టలు చింపి, పళ్లతో కొరికి..!

మార్కెట్‌లో నివాసముంటున్న అమర్‌సింగ్‌ భార్య, కుటుంబ సభ్యులతో నిందితురాలికి గొడవలు ఉన్నాయని పున్‌పున్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ తెలిపారు.

గొడవ జరుతుందని వెళ్తే,  లేడీ కానిస్టేబుల్‌ బట్టలు చింపి, పళ్లతో కొరికి..!
Ai Image
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 12, 2024 | 7:38 AM

బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని పాట్నాలో కొట్లాట సమాచారంతో అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పున్‌పున్ మార్కెట్‌లో జరిగింది. ఇక్కడ ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకోగానే లేడీ కానిస్టేబుల్ బట్టలు చింపేసి మిగతా పోలీసులను తరిమి కొట్టారు.

పున్‌పున్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నేహా కుమారి, పున్‌పున్ పోలీస్ స్టేషన్‌లో పున్‌పున్ కెలాబాగన్ ప్రాంతానికి చెందిన రాహుల్ కుమార్ భార్య డింపుల్ కుమారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మార్కెట్‌లోని ఓ ఇంట్లో జరిగిన గొడవల సమాచారంతో తాను ఇతర పోలీసు బలగాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నానని కానిస్టేబుల్ నేహా తెలిపింది. అక్కడ నిందితురాలు డింపుల్ ఒక వ్యక్తిపై దాడి చేసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు

పోలీసు అధికారులు జోక్యం చేసుకుని సర్ధి చెప్పినా, ఆమె పట్టించుకోలేదు. ఆమె ఆ వ్యక్తితో అనుచితంగా ప్రవర్తిస్తూనే ఉంది. వెంటనే మహిళా కానిస్టేబుల్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, నిందితులు డింపుల్ ఆమెతో గొడవకు దిగింది. ఈ సమయంలో మహిళా కానిస్టేబుల్ దుస్తులను చింపేసింది. అంతేకాదు మహిళా కానిస్టేబుల్‌ను పళ్లతో కొరికి గాయపరిచింది డింపుల్. ఇతర పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా దాడికి పాల్పడింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.

మార్కెట్‌లో నివాసముంటున్న అమర్‌సింగ్‌ భార్య, కుటుంబ సభ్యులతో నిందితురాలికి గొడవలు ఉన్నాయని పున్‌పున్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ తెలిపారు. ఘర్షణ సమయంలో, పోలీసులు వచ్చారు. అక్కడ నిందితురాలు డింపుల్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. మహిళా పోలీసులను బట్టలు చింపేసి కొరికి గాయపరచడమే కాదు. మిగిలిన పోలీసులపై కూడా దాడి జరిగింది. ప్రస్తుతం నిందితురాలు మహిళ పరారీలో ఉంది. ఆమె కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. త్వరలోనే నిందితురాలిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…