బట్టలు ఆరేసేందుకు దండెం కట్టాడని, తండ్రితో కలిసి తమ్ముడికి కొట్టి చంపిన అన్న!
ఇంటి అవరణలో బట్టలు ఆరేసేందుకు తాడు కట్టేందుకు సంతోష్ ప్రయత్నించాడు. ఇక్కడ తాడు కట్టవద్దని తండ్రి, సోదరుడు పోన్‌వీర్ హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్‌లో మానవ మనోభావాలను దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన ఒకటి జరిగింది. బట్టలు ఆరబెట్టడం కోసం కట్టిన తాడు కారణంగా నిండు ప్రాణం బలైంది. సంభాల్‌లో చిన్న వివాదంతో సొంత తమ్ముడిని అన్న కర్రతో కొట్టి చంపాడు. ఈ గొడవలో తండ్రి, సోదరుడు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు. ఈ మేరకు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంభాల్ జిల్లాలోని రాజ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహువా హసంగంజ్ గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకును హత్య చేశాడు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు తండ్రీకొడుకులు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూ పంపిణీ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. తండ్రి కూడా తన పెద్ద కొడుకుతో ఉన్నాడు. రిషిపాల్ తన కుమారుడు సోన్‌వీర్‌తో కలిసి సంతోష్ కుమార్‌ను కర్రలతో కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంటి అవరణలో బట్టలు ఆరేసేందుకు తాడు కట్టేందుకు సంతోష్ ప్రయత్నించాడు. ఇక్కడ తాడు కట్టవద్దని తండ్రి, సోదరుడు పోన్‌వీర్ హెచ్చరించారు. ఈ విషయమై వివాదం పెరగడంతో మృతుడి భార్య భర్తను గదిలో పెట్టి తాళం వేసింది. ఇంతలో నిందితులు ఆమెను ఇంట్లోకి తోసి, సంతోష్ బయటకు లాగి కర్రలతో కొట్టి చంపారు. నిందితులను రిషి పాల్, అతని పెద్ద కుమారుడు సోన్ వీర్(27)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఇందుకు సంబంధించి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..