AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపు బయట కూర్చొన్న తండ్రి, కొడుకు.. దూసుకొచ్చిన మృత్యువు..! షాకింగ్‌ వీడియో

మృత్యువు మనిషిని ఎటునుంచైనా ఎటాక్‌ చేస్తుందని చెప్పేందుకు ఉదాహరణ ఉండే వార్తలు, వీడియోలు కూడా అనేకం సోషల్ మీడియాలో కనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. షాపు బయట కూర్చొని ఉన్న ఓ తండ్రి కొడుకుల మీదకు మృత్యువు ఎలా ముంచుకొచ్చిందో ఈ వీడియోలో కనిపించింది. ఈ ఘటన

షాపు బయట కూర్చొన్న తండ్రి, కొడుకు.. దూసుకొచ్చిన మృత్యువు..! షాకింగ్‌ వీడియో
Tanker Hits Father Son
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2024 | 9:12 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని వింతగా ఉంటే, కొన్ని కడుపుబ్బ నవ్వించేవిగా ఉంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని భయబ్రాంతులకు గురి చేసేవిగా ఉంటాయి. కొన్ని వీడియోలు ప్రమాదాలకు సంబంధించినవి కూడా ఉంటాయి. మృత్యువు మనిషిని ఎటునుంచైనా ఎటాక్‌ చేస్తుందని చెప్పేందుకు ఉదాహరణ ఉండే వార్తలు, వీడియోలు కూడా అనేకం సోషల్ మీడియాలో కనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. షాపు బయట కూర్చొని ఉన్న ఓ తండ్రి కొడుకుల మీదకు మృత్యువు ఎలా ముంచుకొచ్చిందో ఈ వీడియోలో కనిపించింది. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతం హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళిలే..

వైరల్‌ వీడియోలో నాగ్లా ఘాజీపూర్ రోడ్డు సమీపంలోని ఒక షాపు ముందు తండ్రీకొడుకులు కూర్చొన్నారు. ఇంతలో సెప్టిక్‌ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ వారిద్దరిపైకి దూసుకెళ్లింది. షాపు బయట అరుగులపై కూర్చొని ఉన్నారు ఓ తండ్రి, కొడుకు. అంతలోనే రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రాక్టర్ ఒక్కసారిగా వీళ్ల మీదకు దూసుకొచ్చింది. వాళ్లకు ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అంతలోనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. భయంతో ఆ ట్రాక్టర్ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇదంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డైంది. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

View this post on Instagram

A post shared by Eastern Network (@enn.india)

జరిగిన ఘటనతో కంగారుపడిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కిందకు దిగాడు. అక్కడ గుమిగూడిన స్థానికులు ట్రాక్టర్‌ డ్రైవర్‌నుపట్టుకుని చితక్కొట్టారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఒక వ్యక్తి ఆ ట్రాక్టర్‌ను వెనక్కి నడిపాడు. గాయపడిన తండ్రి, కుమారులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..