జర్మనీలో దీపావళి వేడుకలు పురస్కరించుకొని ఔషధ, శాస్త్రీయ పరిశోధనలలో విశేష కృషి చేస్తున్న భారతీయ ప్రవాసులను గౌరవించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్బంగా ప్రొఫెసర్ సోని పుల్లంశెట్టికి జర్మనీలో సన్మానం జరిగింది. కార్డియోపల్మనరీ వ్యాధుల చికిత్స, పరిశోధనలో చేసిన అపూర్వ కృషికి గానూ మెయిన్జ్ లో భారత్ వాసీ జర్మనీ అనే స్వచ్ఛంద సంస్థ.. సోని పుల్లంశెట్టికి సన్మానం చేసింది. మాలిక్యులర్ బయాలజిస్ట్, ఊపిరితిత్తుల పరిశోధకురాలైన సోనీ.. హైదరాబాద్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. P.H.D. కోసం జర్మనీ వెళ్లారు. వైద్య పరిశోధనలో తను చేసిన కృషికిగానూ ఇటీవలే ప్రతిష్ఠాత్మక లియోపోల్డినా సభ్యత్వం లభించింది. దక్షిణాసియా నుంచి ఆ గౌరవం అందుకున్న తొలిమహిళగా నిలిచారు సోనిపుల్లంశెట్టికి .