Watch: స్మశానవాటికలో అలజడి.. సమాధుల కింద భారీ సొరంగం.. ఎక్కడంటే..

ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. సరిహద్దు నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కిలోమీటరుకు పైగా విస్తరించి ఉన్న ఈ సొరంగం లోపల భారీగా ఆయుదాలు బయటపడ్డాయి. ఈ టెన్నెల్‌ నిండా భారీగా..

Watch: స్మశానవాటికలో అలజడి.. సమాధుల కింద భారీ సొరంగం.. ఎక్కడంటే..
Hezbollah Tunnel
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2024 | 1:41 PM

స్మశానవాటికి కింద భారీ టన్నెల్‌ బయటపడింది. అది కేవలం టన్నెల్‌ మాత్రమే కాదు.. దాని నిండా మరణాయుధాలు నిండివున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. లెబనాన్ లోని శ్మశాన వాటిక కింద ఉన్న హెజ్బొల్లా గ్రూపుకు సంబంధించిన భారీ టన్నెల్ ను గుర్తించింది ఇజ్రాయెల్ సైన్యం. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. సరిహద్దు నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కిలోమీటరుకు పైగా విస్తరించి ఉన్న ఈ సొరంగం లోపల భారీగా ఆయుదాలు బయటపడ్డాయి. ఈ టెన్నెల్‌ నిండా భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్ లాంచర్లు, క్షిపణులు, ఇతర మిలిటరీ -గ్రేడ్ పరికరాలతో సహా ఆయుధాల డంప్‌ను గుర్తించింది ఇజ్రాయెల్ సైన్యం.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకారం, దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ సైన్యం స్మశానవాటిక కింద దాగి ఉన్న హిజ్బుల్లా ఏర్పాటు చేసిన టన్నెల్‌ను ధ్వంసం చేసింది. దానిలో 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో నింపేసింది. హెజ్‌బొల్లాకు మనిషి ప్రాణం, జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు అని ఐడీఎఫ్‌ పేర్కొంది. మరోవైపు, సెప్టెంబరులో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌ సైన్యం ప్రవేశించటం ప్రారంభించినప్పటి నుంచి ఐడీఎఫ్‌ పలు సొరంగాలను కనుగొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..