AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric Water: పట్టులాంటి మెరిసే చర్మం కోసం పసుపు నీళ్లు.. ఇలా వాడితే మొటిమలు, మచ్చలు మాయం..!

పసుపులో ఉండే ఔషధ గుణాలు, పసుపు ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు అత్యంత కీలకమైన మసాలా దినుసుగా చెప్పాలి. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పసుపు ఆహారం రంగు, పోషణను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా తోడ్పడుతుంది. పసుపుతో చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయవచ్చు. మెరిసే చర్మం కోసం పసుపును ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Nov 11, 2024 | 1:02 PM

Share
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కర్కుమిన్ మనకు ఎంతో మేలు చేస్తాయి. పసుపు చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మం కోసం, పసుపును ఉపయోగించి అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ మీ ముఖాన్ని పసుపు నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు నీళ్లతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడాను గమనిస్తారు.

1 / 5
పసుపు నీరు ముఖానికి మెరిసే ఛాయను కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు పసుపు నీరు చాలా ఉపయోగకరం. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు కూడా నయమవుతాయి. ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చల సమస్యను త్వరగా పరిష్కారిస్తుంది.

2 / 5
పసుపులో ఉండే పోషకాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. చర్మం దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో పసుపు నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం పొందడానికి మీరు పసుపు నీటిని కూడా ఉపయోగించవచ్చు.

3 / 5
అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం వల్ల మీకు కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అవి మీ అందాన్ని పాడు చేస్తాయి. అలాంటప్పుడు మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు పసుపు నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇందుకోసం ఒక లీటరు నీటిని బాగా వేడి చేసి దానికి 2 స్పూన్ల పసుపు వేసి కలపాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తరువాత స్టౌవ్‌ ఆఫ్‌ చేసి ఆ నీటిని ఫిల్టర్ చేసుకోండి. చల్లారిన తర్వాత దీన్ని ముఖానికి ఉపయోగించవచ్చు.

4 / 5
ముఖానికి పసుపు నీటిని అప్లై చేసే ముందు సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత ఈ నీటితో మీ ముఖం, చర్మాన్ని శుభ్రంగా కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే, చర్మం మంట పోతుంది. ముఖంపై మొటిమల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!