- Telugu News Photo Gallery Taking guava leaves like this prevents any diseases, Check Here is Details
Guava Leaves: జామ ఆకుల్ని ఇలా తీసుకుంటే.. ఎలాంటి రోగాలు దరిచేరవు..
జామ ఆకులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఎన్నో లభిస్తాయి. జామ కాయలే కాకుండా ఆకుల్లో కూడా అనే రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు..
Updated on: Nov 11, 2024 | 12:56 PM

జామ పండు అంటే ఇష్టం ఉండని వారు ఎవరూ ఉండరు. జామ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఒక జామ పండు తింటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను కూడా కంట్రోల్ చేయవచ్చు. డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి. జామ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

కేవలం జామ పండులోనే కాదు.. జామ చెట్టు, ఆకుల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. పూర్వం జామ ఆకుల్లో చింత పండు, కారం, ఉప్పు పెట్టుకుని తినేవారు. ఇప్పుడు ఎవరూ పెద్దగా తినడం లేదు. రోజూ ఒక జామ ఆకు నమిలి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

జామ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల మధుమేహంలో మేలు చేస్తుంది. బ్లడ్‌షుగర్ అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జామ ఆకు రసంలో ఉండే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటే.. గుండె సంబంధిత వ్యాధులు, సమస్యలు కూడా రావు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆకుల్ని మెత్తగా నూరి తలకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. జామ ఆకుల్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, డైటరీ మినరల్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.




