AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రన్నింగ్ గూడ్స్‌ ట్రైన్ పై స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరికి బూడిదయ్యాడు.. షాకింగ్ వీడియో

ఇద్దరు యువకులు రన్నింగ్‌ గూడ్స్‌ రైలు ఎక్కి కిందకు దూకేందుకు సిద్ధపడ్డాడు. కానీ, వారిలో ఒకడు సేఫ్‌గానే దిగాడు.. కానీ, రెండోవాడు దురదృష్టవశాత్తు రెండు కోచ్‌ల మధ్య ఉన్న పట్టాలపై పడిపోవడంతో రైలు మొత్తం ఆ యువకుడిపై నుంచి వెళ్లింది. దీంతో అతడు దారుణంగా మరణించాడు.

రన్నింగ్ గూడ్స్‌ ట్రైన్ పై స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరికి బూడిదయ్యాడు.. షాకింగ్ వీడియో
a boy standing at moving train
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2024 | 12:25 PM

Share

ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ యుగంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వీడియోలు, ఫోటోలు చూస్తామో చెప్పలేం. సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెరమీదకు వచ్చింది. ఇక్కడ కూడా ఇద్దరు యువకులు అత్యంత డేంజరస్‌ స్టంట్‌ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, వారి ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు.. ఇద్దరు ఒక యువకుడు అర్థాంతరంగా రైలు కింద పడి నలిగిపోయాడు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియోలో కదులుతున్న రైలుపై స్టంట్‌ చేయటం అత్యంత ప్రమాదకరం ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినప్పటికీ, కొంతమంది డేర్ డెవిల్స్ ఇప్పటికీ రన్నింగ్‌ట్రైన్స్‌తో విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటిదే ఇద్దరు యువకులు ఒక రన్నింగ్‌ గూడ్స్ రైలుతో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.  ఇద్దరు యువకులు రన్నింగ్‌ గూడ్స్‌ రైలు ఎక్కి కిందకు దూకేందుకు సిద్ధపడ్డాడు. కానీ, వారిలో ఒకడు సేఫ్‌గానే దిగాడు.. కానీ, రెండోవాడు దురదృష్టవశాత్తు రెండు కోచ్‌ల మధ్య ఉన్న పట్టాలపై పడిపోవడంతో రైలు మొత్తం ఆ యువకుడిపై నుంచి వెళ్లింది. దీంతో అతడు దారుణంగా మరణించాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

అతని స్నేహితులు ఇదంతా చూస్తున్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తన స్నేహితుడు కళ్ల ముందే రైలుకింద పడి నలిగిపోయాడు. ఊహించన ఈ దారుణ ఘటనతో అక్కడున్న వారంతా హహాకారాలు చేశారు. వారి ఆర్తనాదాలు ఈ వీడియోలోనూ వెనుక నుంచి వినిపిస్తోంది. ఈ వీడియో memes_and_roasted_video అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. దీనిపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..